Begin typing your search above and press return to search.
విజయసేతుపతి లైఫ్ లో జెస్సీ.. థ్రిల్ అయిపోతారంతే!
By: Tupaki Desk | 18 April 2021 10:30 AM GMTరీల్ లవ్ స్టోరీలు చాలామంది చాలానే చూసి ఉంటారు. కానీ.. రీల్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ లవ్ స్టోరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందునా సెలబ్రిటీల జీవితాల్లో ఇవి మరింత తక్కువ. అయితే.. రీల్ కు ఏ మాత్రం తీసిపోని రియల్ లవ్ స్టోరీ స్టార్ నటుడు విజయసేతుపతిది. తెలుగు వారికి పెద్దగా తెలీని ఆయన లవ్ స్టోరీని ఆయనే వెల్లడించారు తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో. ఆయన లవ్ స్టోరీలోకి వెళ్లే ముందు.. ఆయన గురించి.. ఆయన జీవితం గురించి కాస్త తెలుసుకుంటే మరింత ఆశ్చర్యపోవటమే కాదు.. అతడి మీద గౌరవ మర్యాదలు టన్నుల లెక్కన పెరిగిపోవటం ఖాయం.
మధ్యతరగతి కుటుంబ నేపథ్యం.. తండ్రి ద్రవిడ సిద్ధాంతాల్ని వంటబట్టించుకొని సంపాదన మీద ఏ మాత్రం మోజు లేని కుటుంబానికి చెందిన వ్యక్తి మీద ఎంతలా ఆర్థిక ఒత్తిళ్లు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. విజయసేతు పతి అందుకు మినహాయింపు కాదు. నలుగురు పిల్లలు.. అన్నయ్య తర్వాతి వాడైన సేతుపతి.. చదువులో బిలో యావరేజ్. చదువు లేదు.. చేతుల్లో డబ్బుల్లేవు. తక్కువ జీతానికే ఉద్యోగం చేస్తూ.. మరింత సంపాదించాలంటే దుబాయ్ ఒక్కటే మార్గమని నమ్మటమే కాదు.. అక్కడికెళ్లి.. ప్రతికూల వాతావరణంలో పని చేసి ఇంటిని ఆర్థికంగా సెట్ చేశాడు.
మూడేళ్ల పాటు అతడు పడిన కష్టం ఆ ఇంటి ఆర్థిక సమస్యలకు ఒక సొల్యూషన్ దొరికేలా చేసింది. ఓపక్క ఇంటి కోసం చెమటోడ్చే విజయసేతుపతికి రెండు వన్ సైడ్ లవ్ స్టోరీలు ఉన్నాయి. అవేమీ పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ.. దుబాయ్ లో ఉన్న సమయంలో అతడికి ఆన్ లైన్ లో జెస్సీ పరిచయమైంది. యాహు మెసెంజర్ లో పరిచయమైన వారానికే.. ప్రపోజ్ చేయటం.. ఆ రోజే ఆమె కూడా ఓకే చెప్పేయటం విశేషం.
అలా తమిళియన్ అయిన సేతుపతి.. కేరళకు చెందిన మలయాళీ అయిన జెస్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కేవలం ఆర్నెల్ల పరిచయం వారిని పెళ్లి పీటల మీదకు తీసుకొస్తే.. ఈ రియల్ కథలో సూపర్ ట్విస్టు ఏమంటే.. పెళ్లి పీటల మీదకు వచ్చే వరకు.. జెస్సీ.. విజయసేతుపతి కలవకపోవటం. దుబాయ్ నుంచి తిరిగి వచ్చేసి వ్యాపారం పెద్దగా వర్కువుట్ కాక.. చిన్న ఉద్యోగం చేసుకునే వేళలో.. నాటకాల మీద.. సినిమాల మీద మోజు పెరిగింది.
కానీ.. మిగిలిన మిడిల్ క్లాస్ ఇంట్లో మాదిరే..సినిమాల్లో యాక్టింగ్ వైపు చూస్తే.. అంతే అన్న జెస్సీ మాట.. గర్భవతి అయిన ఆమెకు ఇచ్చిన మాటతో సినిమాల ఆశ వదులుకున్నాడు. అయితే.. మరో ట్విస్టు ఏమంటే.. భార్యకు ఇచ్చిన మాట కోసం సేతుపతి తనకిష్టమైన సినీ కెరీర్ ను వదులుకుంటే.. ఆ విషయం తెలిసిన అతడి తండ్రి.. కోడల్ని ఒప్పించి ప్రోత్సహించాడు. ఈ రోజున స్టార్ నటుడి హోదాలో ఉన్న అతడి రియల్ స్టోరీ రీల్ స్టోరీకి ఏ మాత్రంతీసిపోదనిపించట్లేదు?