Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే?

By:  Tupaki Desk   |   8 Sep 2021 1:30 PM GMT
బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే?
X
బిగ్ బాస్ తెలుగు సీజన్ ఘనంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ షోను ప్రారంభించి ఏకంగా 19మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించాడు. మునుపు ఎన్నడూ లేనంతగా మంది ఉండడంతో రెండో రోజు నుంచే గొడవలు, అలకలు, ఏడుపులు మొదలయ్యాయి. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ నుంచే లొల్లి షురూ అయ్యింది.

తొలి వారంలో సరయూ, జశ్వంత్, రవి, హమీద, మానస్, కాజల్ లు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో ఒకరు ఈ వారి ఎలిమినేట్ కానున్నారు. మూడోరోజు నామినేషన్ సెగలు మొదలయ్యాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అరుపులు మొదలయ్యాయి. ఈ మూడు రోజులు చూస్తే ఒక కంటెస్టెంట్ ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయమన్న ప్రచారం మొదలైంది.

బిగ్ బాస్ హౌస్ లోనే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నాడు జెస్సీ.. ఇతడి అసలు జశ్వంత్ పడాల. ఇతడొక సూపర్ మోడల్. 2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెడిచాడు. ఈ మోడల్ ను ఈసారి బిగ్ బాస్ లోకి పంపించారు.

అయితే అతడు చిన్నా, పెద్ద వారికి ఎవరికి గౌరవం ఇవ్వకుండా దురుసుగా అవమానించేలా ప్రవర్తిస్తుండడంతో గొడవలు మొదలవుతున్నాయి. నామినేషన్ చేసిన వారితో ఇప్పటికే గొడవ పడి కన్నీళ్లు పెట్టుకున్న జెస్సీ మంగళవారం సీనియర్ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆమె కూర్చోనీయకుండా సోఫాపై కాలు పెట్టడంతో ఆనీ మాస్టర్ రెచ్చిపోయింది. అంతే ధీటుగా రెచ్చిపోయి జశ్వంత్ కూడా ఆనీ మాస్టర్ తో ఢీ అంటే ఢీ అని మాటల యుద్ధం చేశాడు. ఆనీ మాస్టర్ తీవ్రంగా జెస్సీపై మండిపడింది.

ఈ విషయంలో తప్పు జెస్సీదే అని అందరూ అనడం.. సోఫాపై కాల్లు పెట్టినందుకు ఆనీమాస్టర్ కు సారీ చెప్పినా కూడా వారిద్దరి మధ్య మాటల యుద్ధం ఆగలేదు.

ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ లో ఏ మాత్రం పరిణతి లేకుండా రూఢ్ గా ప్రవర్తిస్తున్న జెస్సీ ఎలిమినేట్ కావడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. ప్రేక్షకుల దృష్టిలో అతడు విలన్ కావడంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనని అంటున్నారు.