Begin typing your search above and press return to search.

కాకా + బాకా= యాంకరింగ్ ఆఫర్స్

By:  Tupaki Desk   |   8 March 2016 10:30 PM GMT
కాకా + బాకా= యాంకరింగ్ ఆఫర్స్
X
ఇప్పుడున్న యాంకర్స్ లో ఝాన్సీది డిఫరెంట్ స్టయిల్. సీనియర్ అయినా, ఇంకా కెరీర్ ని బాగానే కంటిన్యూ చేస్తోంది. కానీ ఈ మధ్య అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అలాంటి సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన డిక్టేటర్ మూవీ ఆడియో ఫంక్షన్ లో యాంకరింగ్ చేసే అవకాశం ఝాన్సీకే వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఝాన్సీ.. బాలయ్యను ఓ రేంజ్ లో పొగిడేసింది.

ఒక యాక్టర్ గా - ఒక ఎమ్మెల్యేగా బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న తీరు నభూతో నభవిష్యత్ అన్నంతగా పొగడ్తల్లో ముంచెత్తింది ఝాన్సీ. ఈ యాంకరమ్మ ఊదిన బాకా బాగానే వర్కవుట్ అయింది. బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలకు యాంకరింగ్ చేసే ఛాన్స్ ఝాన్సీకే వచ్చింది.

దీంతో కాకా పట్టడంలో మరో రేంజ్ డోస్ పెంచేసింది ఝాన్సీ. బాలకృష్ణను శ్రీరాముడు - శ్రీకృష్ణుడు - భీముడు - సూర్యుడు - చంద్రుడు అంటూ.. అన్ని రకాలుగానూ పొగిడింది. బాలయ్యను ఎమ్మెల్యేగా పొందిన హిందూపూర్ ప్రజల జన్మ ధన్యం అనేసిందంటే.. అమ్మడి బాకా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏమైనా కానీ కాకా పట్టి బాకా ఊదితే పనులు జరగుతాయనే విషయాన్ని ఝాన్సీ మరోసారి ప్రూవ్ చేసింది.