Begin typing your search above and press return to search.

అక్కాచెల్లెళ్లు మిడ్‌నైట్ షోలు

By:  Tupaki Desk   |   15 Oct 2018 9:23 AM GMT
అక్కాచెల్లెళ్లు మిడ్‌నైట్ షోలు
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాలిగా జాన్వీ బాలీవుడ్‌ లో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. న‌టించిన తొలి సినిమా `ధ‌డ‌క్‌` ఘ‌న‌విజ‌యం సాధించింది. న‌టిగా జాన్వీకి క్రిటిక్స్ మంచి మార్కులే వేశారు. ఆ ఉత్సాహంలోనే జాన్వీ త‌దుప‌రి ఓ భారీ చిత్రానికి సంత‌కం చేసింది. క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న `త‌క్త్‌` చిత్రంలో న‌టించేందుకు రెడీ అవుతోంది. అదంతా స‌రే.. జాన్వీకి తొంద‌ర్లోనే ఇంటి నుంచే థ్రెట్ త‌ప్పేట్టు లేదా? అంటే.. అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. త‌న‌కంటే ఒడ్డు పొడ‌వు, అందంలో నాలుగింత‌లు ఎక్కువ‌గా ఉండే సిస్ ఖుషీ క‌పూర్ బ‌రిలో దిగ‌డానికి రెడీ అవుతోంది.

ఖుషీ క‌పూర్ కండ‌బ‌లం ఏపాటిదో ఇదిగో ఈ వీడియో వీక్షిస్తే మీకే అర్థ‌మ‌వుతుంది. అక్కా చెల్లెళ్లు జిమ్ చేయాలంటే స‌రికొత్త ప‌ద్ధ‌తుల్ని అవ‌లంబిస్తున్నారు. ఇదిగో మిడ్ నైట్ వ‌ర్క‌వుట్స్! అంటూ స‌ర్‌ప్రైజ్‌ని ఇస్తున్నారు. గారాల సిస్ ఖుషీ భుజాల‌ పైకి ఎక్కి జాన్వీ సెల్ఫీ వీడియోలు తీస్తోంది. మొత్తానికి అక్కా చెల్లెళ్ల మ‌ధ్య ర్యాపో ముచ్చ‌టేస్తోంది.

ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఉన్న ఆ ప్లేసే కాస్త వింత‌గా ఉంది. అక్క‌డ అదేదో చెప్పుల స్టాండ్‌లా ఉంది. పైగా ఇరుకు సందులో ఆ సెట‌ప్ చూస్తుంటే, వీళ్ల‌కు ఆ ప్లేస్ బాగానే సెట్ట‌యిన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం అక్కా చెల్లెళ్లిద్ద‌రినీ డాడ్ బోనీక‌పూర్, అన్న అర్జున్ క‌పూర్ సంర‌క్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌పూర్ ఫ్యామిలీ ఆద‌ర‌ణ‌తో సిస్ట‌ర్స్ సంతోషంగానే ఉన్నారు.