Begin typing your search above and press return to search.
శ్రీదేవి కూతుర్ల అల్లరి చూడండి!!
By: Tupaki Desk | 1 May 2018 10:45 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు బయట ఎంతో హుందాగా కనిపిస్తారు. స్టైలిష్ డ్రెస్సులో గ్లామరస్ గా కనిపించినా... ఇంట్లో మాత్రం అందరి పిల్లలాగే అల్లరి పిడుగులేనట. తాజాగా వీరి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన ఓ ఫోటో చూస్తే... శ్రీదేవి కూతుర్లు ఇంట్లో ఎలా ఉంటారో తెలిసిపోతుంది. చిన్న పిల్ల మహా ముదురుది బాబోయ్... అనకుండా ఉండలేం.
ధడక్ భామ జాన్వి కపూర్ ని భుజాన ఎత్తుకుని ఊపుతూ తెగ అల్లరి చేసింది ఆమె చెల్లెలు ఖుషీ కపూర్. ఈ ఫోటో చూసిన వాళ్లందరికీ చిన్నదే అయినా మహా చిలిపిది ఖుషీ అనిపించక మానదు. ఇంట్లో చిన్నవాళ్లు చేసే అల్లరి మామూలుగా ఉంటుందా మరి. ఖుషీ వీపు మీదికి ఎక్కిన పెద్దమ్మాయి జాన్వి మాత్రం చెల్లెలు ఎక్కడ పడేస్తుందో అని భయంతో గట్టిగా పట్టుకుని నవ్వుతోంది. ఆమె చేతిపైన జే అండ్ కే అని ఇంగ్లీషు అక్షరాలు టాట్యూ ఉంది. జాన్వీ అండ్ ఖుషీ అనే అర్థంలో ఈ టాటూ ఉన్నట్టుంది. ఖుషీకి ఇలా నచ్చినవారిని భుజానికి వేసుకోవడం మహా సరదా. ఆమె ఫోటోలని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
అతిలోక సుందరి హఠాత్మరణం... యావత్ సినీ లోకాన్ని విషాదంలో ముంచేసింది. ఆ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఆమె తనయలు. తల్లి లేని లోటు కొద్దికొద్దిగా మరిచిపోతూ ఇంతకు ముందులా సంతోషంగా ఆనందంగా గడుపుతుండడం చాలామందిని సంతోషపెడుతోంది.