Begin typing your search above and press return to search.
కూతురి రిలేషన్ పై శ్రీదేవి రియాక్షన్ ఇదే
By: Tupaki Desk | 13 Feb 2017 3:57 PM GMTమాజీ అందాల తార శ్రీదేవి సినిమాల్లో బోలెడంత ఫేమస్. ఇప్పుడు ఆమె తరం అయిపోయింది కాబట్టి.. శ్రీదేవి కూతుళ్ల సినీ అరంగేంట్రం కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు జనాలు. ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్.. సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండింగ్. అటు గ్లామర్ యాంగిల్ లోనే కాదు.. ఇటు రిలేషన్ షిప్స్ విషయంలో కూడా ఇప్పటికే ఈమెపై చాలానే రూమర్స్ ఉన్నాయి.
కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో పీకల్లోతు లవ్ లో ఉందనే టాక్ గతంలో వచ్చింది కానీ.. ఈ మధ్య కొత్త పేరు వినిపిస్తోంది. జాన్వి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అయ్యే వారందరికీ.. అక్షత్ రంజన్ బాగా పరిచితమే. ఎందుకంటే.. ఈ భామ షేర్ చేసిన గ్రూప్ ఫోటోస్ లో చాలావాటిలోనే ఈ కుర్రాడు కనిపిస్తాడు. తాజాగా జాన్వీ కపూర్ ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో జాన్వితో పాటు అక్షత్ కూడా కనిపిస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పక్కనే శ్రీదేవి.. బోనీ కపూర్ లు కూడా ఉంటారు. అందరూ కలిసి ఓ ఫ్యామిలీ ఫోటో రేంజ్ లో పోజ్ ఇచ్చేశారు.
దీనికి ముందు డియర్ జిందగీ ప్రీమియర్ ను చూసేందుకు కూడా శ్రీదేవి.. జాన్వి.. అక్షత్ లు ఒకే కారులో వచ్చారు. మరి కూతురు బాయ్ ఫ్రెండ్ అని ఇంతగా ప్రచారం జరుగుతున్న కుర్రాడితో.. అమ్మ శ్రీదేవి కూడా కనిపించడం.. వాళ్లిద్దరూ జంటగా కనిపిస్తున్నా పెద్దగా కేర్ చేయకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/