Begin typing your search above and press return to search.
మొదటి యాడ్ పట్టేసిన బాలీవుడ్ బ్యూటీ!
By: Tupaki Desk | 15 Sep 2018 6:31 AM GMTశ్రీదేవి వారసురాలిగా 'ధడక్' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. మొదటి సినిమాతో పాస్ మార్కులు తెచ్చుకున్న జాన్వీకి ఇప్పుడు బాలీవుడ్ లో మంచి డిమాండే ఉంది. జస్ట్ సినిమాలే కాదు.. కార్పొరేట్ లు కూడా బ్రాండ్ ప్రమోషన్ కోసం జాన్వీ ని సంప్రదిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం జాన్వీ ఒక బ్రాండ్ కు ప్రచారం కల్పించేందుకు అగ్రిమెంట్ సైన్ చేసిందట.
ప్రముఖ బ్రాండ్ నైకా కు ఇకపై జాన్వీ బ్రాండ్ ఎండార్స్ మెంట్ చేస్తుంది. నైకా పేరు తెలిసిన వాళ్ళకు సరే.. తెలియని వాళ్ళకోసం చెప్పుకుందాం. ఇదొక మల్టీ బ్రాండ్ కాస్మెటిక్ అండ్ వెల్ నెస్ ప్రొడక్ట్స్ ఆన్ లైన్ స్టోర్. ఆన్ లైన్ తో పాటు కొన్ని నగరాల్లో స్టోర్లు కూడా నడుపుతున్నారు. త్వరలో వాళ్ళు అన్నీ నగరాలకు కూడా ఈ స్టోర్లు విస్తరించే ప్లాన్స్ లో ఉన్నారు. ఈ బ్రాండ్ గురించి మాట్లాడుతూ "మేకప్ కు సంబంధించిన నైకా బ్రాండ్ తో అసోసియేట్ కావడం.. ప్రయాణం కొనసాగించడం ఒక గౌరవం గా భావిస్తున్నాను. ఈ జర్నీ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించడానికి మరో కారణం ఉంది. ఈ బ్రాండ్ మోడల్స్ కంటే కూడా సాధారణ అమ్మాయిల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం వాళ్ళ గురించి మాట్లాడడం చాలా నచ్చింది."
ఇక త్వరలో ఈ బ్రాండ్ కు సంబంధించిన యాడ్స్ రానున్నాయి. అంతా బాగుంది గానీ ఈ అందాలను మెరుగుపరిచే ఉత్పత్తుల ప్రచారానికి రొక్కం ఎంత పుచ్చుకుందో మాత్రం ఒక్క మాట చెప్పలేదు. ఎంతైనా శ్రీదేవి - బోనీ ల కూతురు కదా.. రెమ్యునరేషన్ తప్ప ఇక దేని గురించైనా మాట్లాడుతుంది.