Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురు అనిపించిందిగా

By:  Tupaki Desk   |   15 March 2018 3:16 AM GMT
శ్రీదేవి కూతురు అనిపించిందిగా
X
అతిలోక సుందరి.. భారతదేశం మొత్తం మెచ్చిన నటి శ్రీదేవి కెరీర్ పూలపాన్పు ఏమీ కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎన్నో కష్టపడింది. జీవితంలో తనకు ఎదురైన కష్టాలన్నింటినీ పెదవి చివరనే దాచి పెట్టి అందమైన చిరునవ్వుతో వెండితెరను మెరిపించింది. తను పడ్డ కష్టం తన బిడ్డలు పడకూడదనే కూతుళ్లకు జీవితంలో ప్రతి స్టేజిలోనూ అండగా నిలబడింది.

శ్రీదేవి పెద్దకుమార్తె జాన్వి ధడక్ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న టైంలో అనూహ్యంగా శ్రీదేవి మరణించింది. ఈ సంఘటన అందరికన్నా ఆమె కుమార్తెలకే అతి పెద్దలోటు. అయినా జాన్వి బాధను దిగమింగుకుని కొద్దిరోజుల్లోనే ధడక్ సెట్లోకి వచ్చేసింది. ఆవేదన కళ్లలోనే దాచుకుని షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. హీరోయిన్ గా కెరీర్ కొనసాగాలంటే ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో జాన్వికి తెలియంది కాదు. అందుకే అప్పుడే జిమ్ కు కూడా వెళ్లడం మొదలెట్టింది.

తల్లి తనను ఎలా చూడాలని అనుకుందో ఆ స్టేజీకి వెళ్లడానికి జాన్వి పెడుతున్న ఎఫర్ట్ బాలీవుడ్ లో అందరినీ మెప్పిస్తోంది. కమిట్ మెంట్ లో శ్రీదేవికి అసలైన వారసురాలని కితాబిస్తున్నారు. మరాఠీ సూపర్ హిట్ ఫిలిం సైరట్ కు అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ధడక్ జులైలో రిలీజయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాత. బాలీవుడ్ షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ ఇందులో హీరో.