Begin typing your search above and press return to search.
అతిలోక సుందరి భువికి దిగి వచ్చే వేళ
By: Tupaki Desk | 13 Aug 2019 8:26 AM GMTఅతిలోక సుందరి శ్రీదేవి 54వ పుట్టినరోజు నేడు. మామ్ ఇహలోకాన్ని వీడి వెళ్లారు కాబట్టి 54వ జయంతిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె జాన్వీలోనే శ్రీదేవిని అభిమానులు చూసుకుంటున్నారనే చెప్పాలి. జాన్వీ ధడక్ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. నేడు శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ ఎంతో ఎమోషనల్ అయ్యింది.
తల్లితో తన అనుబంధాన్ని ఆవిష్కరించే ఓ ఫోటోని జాన్వీ అభిమానులకు షేర్ చేశారు. ``హ్యాపీ బర్త్ డే అమ్మా.. ఐ లవ్యూ`` అని వ్యాఖ్యను జోడించింది జాన్వీ. మామ్ మరణించిన తర్వాత చాలా కాలం జాన్వీ కపూర్ - ఖుషీ కపూర్ ఈలోకంలోకి రాలేకపోయారు. ఆ తర్వాత కథానాయికగా సెట్స్ కి వెళ్లినప్పటి నుంచే జాన్వీ తిరిగి మనిషి అయ్యింది. ప్రస్తుతం తక్త్ అనే భారీ చిత్రంతో పాటు గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. దాంతో పాటే మరో రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేసింది. నేడు శ్రీదేవి జయంతి సందర్భంగా అభిమానులు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. `మిమ్మల్ని మిస్సవుతున్నాం మేడమ్` అంటూ ఆవేదనగా ట్వీట్లు చేస్తున్నారు.
2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించారు. దుబాయ్‌లోని ఓ హోటల్ స్నానాల గది టబ్ లో ప్రమాదవశాత్తు పడి తుదిశ్వాస విడిచారు. శ్రీదేవికి అత్యంత సన్నిహితులైన కరణ్ జోహార్- మనీష్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. శ్రీదేవి జయంతి సందర్భంగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు చేస్తున్నారు.