Begin typing your search above and press return to search.

జాన్వీ సరదా సంఘటన రేప్‌ వరకు వెళ్లింది

By:  Tupaki Desk   |   28 Nov 2018 6:07 AM GMT
జాన్వీ సరదా సంఘటన రేప్‌ వరకు వెళ్లింది
X
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కు బాలీవుడ్‌ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి అభిమానులు ఉన్నారు. శ్రీదేవి మరణం తర్వాత జాన్వీలోనే శ్రీదేవిని చూసుకుంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకే జాన్వీకి హెల్ప్‌ చేసేందుకు నో చెప్పిందనే కారణంగా అన్షులాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కొందరు సోషల్‌ మీడియా వేదికపై అన్షులాను తిట్టి పోస్తుంటే మరి కొందరు ఫోన్‌ నెంబర్‌ సంపాదించి మరీ ఆమెపై మాటల దాడి చేస్తున్నారట. ఇంతకు ఈ అన్షులా ఎవరో తెలుసా స్వయానా జాన్వీకి సోదరి(బోణీ కపూర్‌ మొదటి భార్య కూతురు - అర్జున్‌ కపూర్‌ సోదరి). అవును ఏదో సరదాకు తన సోదరి అన్షులా గురించి జాన్వీ చేసిన కామెంట్‌ ఇప్పుడు చాలా సీరియస్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జాన్వీ కపూర్‌ తాజాగా కరణ్‌ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ కు హాజరు అయ్యింది. ఆసమయంలో పలు విషయాల గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌ ను కరణ్‌ ఒక ప్రశ్న అడగగా ఆ సమయంలో హెల్ప్‌ లైన్‌ తీసుకుని తన అక్క అయిన అన్షులాకు ఫోన్‌ చేసింది. ఆ సమయంలో సరదాగా జాన్వీకి హెల్ప్‌ చేసేందుకు నిరాకరించింది. అదంతా కూడా సరదాగా సాగిన విషయం. కాని కొందరు ఆ సంఘటన సీరియస్‌ గా తీసుకున్నారు. దాంతో అన్షులాపై విరుచుకు పడుతున్నారు.

అన్షులాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జాన్వీ స్వయంగా రంగంలోకి దిగింది. తన సోదరి అన్షులాను రేప్‌ చేస్తామంటూ కొంత మంది సోషల్‌ మీడియా ద్వారా బెదిరిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కొందరు హద్దులు మీరుతున్నారు. అత్యంత దుర్మార్ఘంగా ప్రవర్తిస్తూ మానసిక రోగుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు అంటూ వాపోయింది. తనపై అభిమానంను తన అక్కపై కోపంగా చూపించడంతో జాన్వీ కపూర్‌ కు పట్టరాని కోపం వచ్చింది. అన్షులాపై విమర్శలు చేసిన వారిని మానసిక రోగులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సోషల్‌ మీడియాలోని కొందరు వ్యక్తుల వల్ల జాన్వీ తీవ్రంగా మనో వేదనకు గురైనట్లుగా తెలుస్తోంది.