Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బెల్ బాటమ్ సుందరి
By: Tupaki Desk | 21 Nov 2018 4:53 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవి బెల్ బాటమ్ రోజుల్ని ఓమారు గుర్తు చేసుకోవాల్సిందే. `ఆకలిరాజ్యం` లో కమల్ హాసన్ తొడుక్కున్న బెల్ బాటమ్ ఫ్యాంటును - `మరోచరిత్ర` పాటలో సరిత తొడుక్కున్న బెల్ బాటమ్ ఫ్యాంటును, సీతాకోక చిలుకలో కార్తీక్ తొడుక్కున్న బెల్ బాటమ్ ఫ్యాంటును - ఎన్టీఆర్ - ఏఎన్నార్ - శోభన్ బాబు తొడుక్కున్న బెల్ బాటమ్ వెడల్పాటి ఫ్యాంటును అంత తేలిగ్గా మర్చిపోగలమా? అప్పట్లో అదో ట్రెండ్. ఆ ట్రెండ్ ఆ తర్వాత మారిపోయి టైట్ ఫిట్ లు వచ్చాయి. అవి వెళ్లిపోయి లూజు ఫ్యాంటులు, ఆ తర్వాత మళ్లీ భూమి గుండ్రంగా తిరిగి అక్కడికే వచ్చిన చందంగా అవే ఫ్యాషన్స్ మారిన జనరేషన్ తో పాటు తిప్పి తిప్పి మన టైలర్లు తిరిగి అలవాటు చేశారు.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ టీనేజీ కూన బెల్ బాటమ్ లో ఆరోజుల్ని గుర్తు చేస్తోంది. ఇంతకీ ఎవరీ కూన? అంటే పరిచయం అక్కర్లేదు. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్. `ధడక్` సినిమాతో తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. వాలు చూపులతో వలలు వేసిందన్న ప్రశంసా దక్కించుకుంది. ఇకపోతే సిస్టర్ సోనమ్ కపూర్ బాటలో అల్ట్రా మోడ్రన్ ఫ్యాషనిస్టా స్టైల్ ని ఇమ్మిటేట్ చేస్తోంది. వీలున్న ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త ట్రెండ్‌ని పరిచయం చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతోంది.
ఫేజ్ 3 ప్రపంచంలో సెలబ్రిటీ కిడ్ ఎలా ఉండాలో జాన్వీ కొత్త పాఠాలు ప్రపంచానికి నేర్పిస్తోంది. క్యాచ్ చేసిన వాళ్లకు క్యాచ్ చేసినంత. అప్పట్లో మామ్ శ్రీదేవి తొడుక్కున్న బెల్ బాటమ్ ఫ్యాంటు గుర్తుకొచ్చిందో లేక మామ్ తొడుక్కున్న ఫ్యాంటునే జాన్వీ తొడుక్కుందో కానీ, అచ్చం పదహారేళ్ల వయసు శ్రీదేవిని బెల్బాటమ్లో చూసినట్టే ఉంది.