Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జాన్వీ కంచు బ్యూటీ

By:  Tupaki Desk   |   31 Dec 2018 1:30 AM GMT
ఫోటో స్టోరి: జాన్వీ కంచు బ్యూటీ
X
ఒకే ఒక్క సినిమాతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకుంది జాన్వీ క‌పూర్‌. ఆరంగేట్ర‌మే ధ‌డ‌క్ చిత్రంతో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి వార‌సురాలిగా స‌త్తా చాటింది. వృత్తిగ‌త యాటిట్యూడ్ తోనే కాదు, వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌తోనూ ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ట్రెండీగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది. ముఖ్యంగా బోయ్స్ లో ప్ర‌త్యేకంగా ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది. ధ‌డ‌క్ చిత్రంలో అభిన‌య‌నేత్రిగా ఆక‌ట్టుకున్న జాన్వీ - ఆ త‌ర్వాత వెంట‌నే `త‌క్త్` లాంటి భారీ చిత్రానికి సంత‌కం చేసింది.

ప్ర‌స్తుతం ఫేజ్ -3 క్రౌడ్ లో జాన్వీ ఓ హాట్ టాపిక్‌. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా జాన్వీ త‌న రూప‌లావ‌ణ్యాన్ని ఎలివేట్ చేస్తోంది. సోష‌ల్ మీడియా క్వీన్ గా నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటోంది. జాన్వీ ఫోటోలు - వీడియోలు అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. వీట‌న్నిటినీ మించి మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్‌ల‌తోనూ అంతే వేడి పెంచుతోంది. స్టైల్ ఎలివేష‌న్‌లో ఫ్యాష‌న్ ఐక‌న్ గా వెలిగిపోతోంది.

తాజాగా జాన్వీ క‌పూర్ ప్ర‌ఖ్యాత కాస్మోపాలిట‌న్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌ పేజీకి ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఆ క‌వ‌ర్ ఫోటో యూత్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది. సిల్వ‌ర్ క‌ల‌ర్ ఛ‌మ్కీల‌ డ్రెస్ లో త‌ళ‌త‌ళ‌లాడిపోతోంది జాన్వీ. ఆ హెయిర్ స్టైల్ కి పెర్ఫెక్ట్ యాప్ట్ గా క‌నిపిస్తోంది. స్ట్రాప్ లెస్ డ్రెస్ లో మ‌తిచెడే తీరుగా ఫోజులిచ్చింది. జాన్వీ ప్ర‌స్తుతం త‌క్త్ చిత్రంతో పాటు ఇత‌ర ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసేందుకు రెడీ అవుతోందట‌.