Begin typing your search above and press return to search.
ఒకేరకమైన షర్టు వేసుకున్న ధడక్ జంట!
By: Tupaki Desk | 21 Feb 2019 2:30 AM GMTశ్రీదేవి తనయురాలిగా బాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ మొదటి సినిమా 'ధడక్' తో మంచి మార్కులే తెచ్చుకుంది. ఆ తర్వాత కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లోనే మరో సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే జాన్వి మొదటి నుంచి తన డ్రెస్ సెన్స్ విషయంలో ఫ్యాషన్ ప్రియుల నుండి ఫుల్ మార్కులు తెచ్చుకుంటూ ఫ్యాషన్ ఐకాన్.. ఫ్యాషనిస్టా అనే బిరుదులను సొంతం చేసుకుంటోంది.
రీసెంట్ గా ఒక హుడ్ ఉండే ఎరుపు రంగు టీ-షర్ట్ ధరించి బయట దర్శనమిచ్చింది. కింద ఒక చిట్టిపొట్టి మెరూన్ కలర్ నిక్కర్ వేసుకొని అల్ట్రా మోడరన్ బ్యూటీలా కనిపించింది. ఒక లైట్ బ్లూ కలర్ బ్యాగ్ భుజానికి వేలాడుతూ ఉంది. ఇక లూజ్ హెయిర్ ను సవరించుకుంటూ నడిచి వస్తుంటే అతిలోక సుందరి డాటర్ అని ఎవరైనా అనుకోవాల్సిందే. మరోవైపు సేమ్ టీ-షర్టు 'ధడక్' సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ కూడా ఇంకో సందర్భంలో వేసుకున్నాడు. ఆ షర్టు వేసుకొని ఒక సెల్ఫి తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో కూడా వైరల్ అయింది. 'ధడక్' సినిమా సమయంలోనే ఇషాన్ - జాన్విల మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపించాయి కదా .. ఇప్పుడు సేమ్ టీ-షర్ట్ లో ఇద్దరూ మరోసారి కనిపించడంతో సేమ్ ఎఫైర్ మ్యాటర్ ను బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటూ గుసగుసలాడుకున్నారట.
ఆ రూమర్ల సంగతి పక్కన పెట్టి మళ్ళీ టీ-షర్ట్ సంగతి మాట్లాడుకుందాం. ఈ టీ-షర్ట్ డిజైన్ చేసింది ఇంటర్నెట్ సెన్సేషన్ భువన్ రామ్.. ఇతని డిజైన్లు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఆయన రిలీజ్ చేసిన లేటెస్ట్ డిజైన్లను ఈమధ్య చాలామంది సెలెబ్రిటిలకు పంపాడట. ఆ లిస్టులో ఈ 'ధడక్' జంట కూడా ఉన్నారు. వాళ్ళు ఆలస్యం చేయకుండ వెంటనే ఆ టీ-షర్టు ను వేసేసుకున్నారు. ఇంతవరకూ ఫుల్ క్లారిటీ వచ్చింది. కానీ ఆ షర్టు పై 'హజిల్ కరో భాసద్ నహీ' అని కొటేషన్ ఉంది. గూగులమ్మను అడిగితే అదేంటో సమాధానం చెప్పలేక బిక్కమొహం వేసింది. మీకెవరికైనా ఆ అర్థం తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోండి న్యూ జెనరేషన్ బాబులు..