Begin typing your search above and press return to search.

సైడుగా చూస్తే మ‌మ్మీ శ్రీ‌దేవిలా!

By:  Tupaki Desk   |   28 Feb 2019 4:49 PM GMT
సైడుగా చూస్తే మ‌మ్మీ శ్రీ‌దేవిలా!
X
అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అంద‌చందాల గురించి వ‌ర్ణించేందుకు క‌వుల‌కు త‌ట‌ప‌టాయించే స‌న్నివేశ‌మే లేదు. ఆ క‌ళ్ల‌కు వీరాభిమానులు ఉన్నారు. క‌నురెప్ప‌ల్ని ట‌ప‌ట‌ప‌లాడిస్తూ క్ష‌ణ‌క్ష‌ణం యువ‌త‌రం గుండెల్లో వీణ‌లు మోగించిన గొప్ప అభిన‌య నేత్రి శ్రీ‌దేవి. అందుకే అచ్చం త‌న‌లా క‌నిపించే.. త‌నంత గొప్ప‌గా అభిన‌యించే వేరొక క‌థానాయిక పుడుతుందా? అంటూ అభిమానులు సందేహం వ్య‌క్తం చేస్తుంటారు. శ్రీ‌దేవే మ‌ళ్లీ పుట్టాలి అన్న నిర్వేద‌న క‌నిపిస్తుంటుంది ఫ్యాన్స్ లో. భార‌త‌దేశ చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో శ్రీ‌దేవి ఒక గొప్ప అధ్యాయం. అందుకే శ్రీ‌దేవి లా ఇంకెవ‌రు? అన్న ప్ర‌శ్న ప్ర‌తిసారీ అలానే శేష ప్ర‌శ్న‌గా మిగిలిపోతోంది.

ఆ స్థానాన్ని జాన్వీ భ‌ర్తీ చేస్తుందా? అంటే ఛాన్స్ ఉంద‌నే ఈ ఫోటో చెబుతోంది. సైడు నుంచి చూస్తే మ‌మ్మీ పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. 16 ఏళ్ల వ‌య‌సు శ్రీ‌దేవిని త‌ల‌పిస్తోంది. జాన్వీ మోడ్ర‌న్ డే గాళ్ కాబ‌ట్టి స్టైలిష్ గా త‌యారైంది కానీ, 16 ఏళ్ల వ‌య‌సులో ఇప్ప‌ట్లా అల్ట్రా మోడ్ర‌న్ మేక‌ప్ స్టైలింగ్స్ ని అనుక‌రించి ఉంటే శ్రీ‌దేవి ఇంత‌కంటే పోష్ గానే క‌నిపించేదేమో! అయితే శ్రీ‌దేవి 50 ఏజ్ లోనే అద్భుత‌మైన స్టైలింగ్‌తో క‌నిపించారు. టాప్ టు బాట‌మ్ ట్రెండీ స్టైల్ .. పోష్ లుక్ తో కనిపించి జాన్వీ, ఖుషీల‌తోనే పోటీ ప‌డ్డారు.

అచ్చంగా మ‌మ్మీనే త‌ల‌పిస్తున్న జాన్వీ ప్ర‌స్తుతం ఓ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల‌ బ్రాండ్ కి ప్ర‌మోష‌న్స్ చేస్తోంది. స‌న్నీలియోన్ స్టార్ స్ట‌క్ ప్ర‌మోష‌న్స్ త‌ర‌హాలోనే ప్ర‌ఖ్యాత నైకా కాస్మొటిక్స్ బ్రాండ్ కి ప్ర‌మోష‌న్ చేస్తోంది. ఇప్ప‌టికే ధ‌డ‌క్ హీరోయిన్ గా పాపుల‌రైంది. సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో గుబులు పెంచుతోంది కాబ‌ట్టి ఇలా సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌మోష‌న్స్ కి బాగానే కాంట్రాక్టులు కుదుర్చుకుంటోంద‌న్న‌మాట‌. ప్రస్తుతం జాన్వీ బ్రాండ్ బిల్డింగ్ ప‌నిలో ఉంది కాబ‌ట్టి రెగ్యుల‌ర్ గా ఫోటోషూట్ల‌తోనూ అంతే వేడెక్కించేస్తోంది. అన్న‌ట్టు జాన్వీ న‌టించే త‌క్త్ ఎప్పుడు ప్రారంభం కానుందో తెలియాల్సి ఉంది.