Begin typing your search above and press return to search.

#జాన్వీ.. గుండె న‌రం మీటుతున్న స్లీవ్ లెస్ బ్లౌజు

By:  Tupaki Desk   |   5 March 2021 4:30 PM GMT
#జాన్వీ.. గుండె న‌రం మీటుతున్న స్లీవ్ లెస్ బ్లౌజు
X
జాన్వీ క‌పూర్ న‌టించిన `రూహీ అఫ్జానా` త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. ఈ మూవీలో రాజ్ కుమార్ రావ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. హార‌ర్ కాన్సెప్ట్ మూవీలో న‌ట‌వార‌సురాలు జాన్వీ తొలిసారిగా ఓ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో నటించింది.

ఇంత‌కుముందే అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ లో జాన్వీ న‌ర్త‌న చూసి యూత్ ఫిదా అయిపోయారు. రూహీ నుంచి `న‌దియోం పార్ ..` వీడియో సాంగ్ లో జాన్వీ అదిరిపోయే డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టింది. మామ్ శ్రీ‌దేవినే త‌ల‌పించింది! అంటూ కితాబు అందుకుంది. హర్రర్ కామెడీ `రూహి అఫ్జానా` మార్చి 11 నుంచి థియేట‌ర్ల‌లో అందుబాటులోకి వ‌స్తోంది. స్త్రీ త‌ర‌హాలోనే స‌రికొత్త కాన్సెప్టుతో ఈ మూవీ ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు.

ఇక‌పోతే రూహీ డే 4 అంటూ జాన్వీ స్వ‌యంగా స్పెష‌ల్ స్లీవ్ లెస్ లుక్ ని రివీల్ చేసింది. ఆ మెరుపుల గోల్డెన్ బ్లౌజ్ జాన్వీ అందాన్ని ప‌దింత‌లు ఎలివేట్ చేస్తోంది. కైపు క‌ళ్ల‌తో క‌వ్వించే చూపుల‌తో జాన్వీ వ‌ల‌పు దోపిడీ చేస్తోంది. ఈ భామ‌ మాయాజాలం యువ‌త‌రంపై స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఈ సినిమా రిలీజ‌య్యాక పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దోస్తానా సీక్వెల్లోనూ జాన్వీ న‌టిస్తోంది.