Begin typing your search above and press return to search.
అబ్బో... సౌత్ పై కాస్త అభిమానం ఉందే
By: Tupaki Desk | 21 Nov 2018 4:19 AM GMTసౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో స్థిరపడిన శ్రీదేవి ఎప్పుడు కూడా సౌత్ సినిమాలపై - సౌత్ ప్రేక్షకులపై అభిమానంను చూపించేది. తనకు సినీ కెరీర్ ను ఇచ్చిన సౌత్ సినిమా పరిశ్రమను ఆమె ఎప్పుడు కూడా గుర్తుంచుకునేది. సౌత్ సినిమా పరిశ్రమకు చెందిన వారితో సన్నిహిత సంబంధాలను ఆమె కలిగి ఉండేదని అంతా అంటూ ఉంటారు. అయితే ఆమె వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ మాత్రం సౌత్ సినిమాలంటేనే ఆసక్తి చూపడం లేదు. ఆమద్య తెలుగు - తమిళ నిర్మాతలు ఆమెను సంప్రదించిన సమయంలో ప్రస్తుతానికి సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తి లేదు అంటూ చెప్పుకొచ్చిందట. సౌత్ పై ఆమెకు పెద్దగా ఆసక్తి లేదని తేలిపోయింది.
కాని ఒక విషయంలో మాత్రం ఆమెకు సౌత్ పై కాస్త అభిమానం ఉందని తాజాగా కాఫీ విత్ కరణ్ షో ద్వారా వెళ్లడయ్యింది. తాజాగా ప్రముఖ టాక్ షో కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడటం జరిగింది. ఆ షోకు సంబంధించిన టీజర్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక టీజర్ లో కరణ్ - జాన్వీతో ఒకవేళ ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ తో మీరు రూం ను షేర్ చేసుకుంటే ఎవరితో షేర్ చేసుకుంటారు అంటూ ప్రశ్నించాడు. అందుకు జాన్వీ సమాధానంగా దీపిక పదుకునే పేరు చెప్పింది.
దీపికతో పాటు నాది సౌత్ బ్యాక్ గ్రౌండ్ అవ్వడం వల్ల ఇద్దరం కూడా సౌత్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతాం. ఇద్దరం కలిశాం అంటే సౌత్ మ్యూజిక్ గురించి చర్చించుకుంటాం. అందుకే ఆమెతో రూం షేర్ చేసుకుంటే మ్యూజిక్ గురించి చర్చించుకోవచ్చు అంటూ జాన్వీ కపూర్ సమాధానం చెప్పింది. సౌత్ సినిమాలపై ఆసక్తి లేని జాన్వీ కపూర్ కు సౌత్ మ్యూజిక్ అంటే ఇష్టం ఉండటం కాస్త ఆశ్చర్యకర విషయమే.
ఇక జాన్వీ కపూర్ ను సౌత్ సినిమాల్లో చూడాలని శ్రీదేవి అభిమానులు కోరుకుంటున్నారు. అమ్మ అభిమానుల కోసం అయినా జాన్వీ ఒక సినిమాను సౌత్ లో చేస్తుందేమో చూడాలి.