Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతురు.. అచ్చు అమ్మలాగే!

By:  Tupaki Desk   |   21 Sep 2017 9:08 AM GMT
శ్రీదేవి కూతురు.. అచ్చు అమ్మలాగే!
X
గత తరం అందాల తార శ్రీదేవికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు ఆమె కూతురు జాన్వి కపూర్ సినిమా ఎంట్రీ కోసం జనాలు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారంటే.. అదంతా శ్రీదేవి జనాలను మెప్పించిన తీరు.. తన అందంతో ఆకట్టుకున్న విధానం పుణ్యమే. మరాఠీ మూవీ సైరత్ హిందీ రీమేక్ ద్వారా జాన్వి కపూర్ ఫిలిం ఎంట్రీ ఇవ్వనుందని ఇప్పటికే వార్తలు ఉన్నాయి.

దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈమెను లాంఛ్ చేయనుండగా.. ఇప్పుడీ బ్యూటీలో తెగ మార్పులు కనిపించేస్తున్నాయి. యాక్టింగ్ కోసం ట్రైనింగ్ లాంటివి అన్నీ ఇప్పటికే జరిగిపోయి ఉంటాయి కానీ.. ఇప్పుడీ చిన్నదాని ముఖ కవళికల్లో కూడా బోలెడన్ని మార్పులు వచ్చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం జాన్వి ఫోటోలకు.. ఇప్పటి పిక్చర్స్ కు మధ్య అంతరం చూస్తే.. ఈ భామ రీసెంట్ గా ఫేషియల్ ఆపరేషన్స్ చేయించుకుందనే సంగతి అర్ధమైపోతుంది. గతంలో ఈమె ముక్కు చాలా వెడల్పుగా కనిపించేది . కానీ ఇప్పుడు మాత్రం సన్నగా మారిపోవడాన్ని గమనించవచ్చు.

మరోవైపు గెడ్డం ఆకృతి.. ముఖం ఆకారం చూస్తే.. ఇంత షార్ట్ టైంలో.. ఇంతగా మార్పులు ఎలా సాధ్యమయ్యాయో ఊహించుకోవచ్చు. గతంలో శ్రీదేవి కూడా ఆపరేషన్స్ ద్వారానే తన అందాన్ని మరింత ఇనుమడింపచేసుకుంది. అయితే.. ఆమె కెరీర్ లో సక్సెస్ అయ్యాక ఇవన్నీ చేస్తే.. కూతురు మాత్రం ముందు నుంచే మొదలుపెట్టేసింది.