Begin typing your search above and press return to search.
జాన్వి మదర్స్ డే విషెస్ సో స్పెషల్!
By: Tupaki Desk | 12 May 2019 4:50 AM GMTబాలీవుడ్ లో ఉన్న చాలామంది హీరోయిన్లే ఉన్నారు కానీ జాన్వి కపూర్ కు మాత్రం ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దానికి మిగతా కారణాలు ఎన్ని ఉన్నప్పటికే ముఖ్యమైన రీజన్ మాత్రం అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు కావడమే. ఇప్పుడు ప్రేక్షకుల్లో కొంతమంది జాన్వి నటన పట్ల పెదవి విరుస్తున్నారు కానీ వాళ్ళే జాన్వికి ఒక్క హిట్ పడిందంటే మెచ్చుకుంటారు. శ్రీదేవికి తగ్గ కూతురు అని కాంప్లిమెంట్స్ ఇస్తారు.
అసలు ఇప్పుడు జాన్వి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఈ రోజు మదర్స్ డే. ప్రతి సంవత్సరం మే నెల రెండో ఆదివారాన్ని మదర్స్ డే గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జాన్వి ఒక బ్యూటిఫుల్ ఫోటోను తన ఇన్ స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "ప్రేమతో కేర్ తీసుకోండి.. వారి మాట వినండి.. ప్రపంచంలో ఉన్న ప్రేమంతా వారికివ్వండి.. హ్యాపీ మదర్స్ డే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటోలో హాఫ్ వైట్ శారీలో శ్రీదేవి చాలా అందంగా ఉన్నారు. ఒడిలో చిన్నారి జాన్విని కూర్చోబెట్టుకుని ఒకింత గర్వంగా నవ్వుతూ పోజిచ్చారు. ఇక బుడుగులా ఉన్న జాన్వి నవ్వు కూడా అదిరిపోయింది. ఈ ఫోటో నేపథ్యంలో గిఫ్టులు గట్రా చూస్తుంటే జాన్వి పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఫోటోలా అనిపిస్తోంది. మదర్స్ డే రోజు షేర్ చేసుకునేందుకు ఇంతకంటే బెస్ట్ పిక్ ఏముంటుంది చెప్పండి. నిజంగానే జాన్వికి ఇప్పుడు అమ్మగారు శ్రీదేవి పక్కనే ఉంటే ఎంత బాగుండేదో కదా?
ఈ ఫోటోకు నెటిజనుల నుండి భారీ స్పందన దక్కింది. జస్ట్ గంటలో లోపే రెండు లక్షల లైక్స్ వచ్చాయి. దియా మిర్జా.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి బాలీవుడ్ తారలు ఈ ఫోటోను లైక్ చేయడం విశేషం. దియా మిర్జా ఈ ఫోటోను లైక్ చేయడంతో పాటుగా 'ప్రెషియస్..ప్రెషియస్..ప్రెషియస్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజమే కదా. అమ్మకంటే విలువైనది ప్రపంచంలో ఏదైనా ఉంటుందా..???