Begin typing your search above and press return to search.
అమ్మ అలా చేయమందంటోన్న జాన్వీ!
By: Tupaki Desk | 25 July 2018 2:30 PM GMTప్రస్తుతం టాలీవుడ్ - బాలీవుడ్ లోకి అడుగుపెడుతోన్న యంగ్ హీరోయిన్లు తొలి సినిమాలోనే అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. టూ పీస్ బికినీలు - లిప్ లాక్ లు - హాట్ సీన్లలో నటించేందుకు అస్సలు సందేహించడం లేదు. ఒకవేళ ఒకటి రెండు సినిమాల్లో పద్ధతిగా కనిపించినా...కాంపిటీషన్ ను తట్టుకునేందుకు ఎక్స్ పోజింగ్ బాట పడుతున్నారు. అయితే, అదే తరహాలో తన తొలి సినిమాలోనే లిప్ లాక్ చేసిన జాన్వి కపూర్....ఎక్స్ పోజింగ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గ్లామర్ కు వల్గారిటీకి చాలా తేడా ఉందని....ఎక్స్ పోజింగ్ పేరుతో అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అయితే, తన లిమిట్స్ లో తానుంటానని....పాత్ర డిమాండ్ చేస్తే ఓ పరిధి వరకు అందాల ఆరబోతకు రెడీ అని తెలివిగా సమాధానమిచ్చింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా `ధడక్`సినిమా గురించి, ఎక్స్ పోజింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అతిలోక సుందరి - దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ అరంగేట్రంలోనే అదరగొట్టింది. 'ధడక్' సినిమాలో జాన్వీ తల్లికి తగ్గ తనయగా నటనతో ఆకట్టుకుంది. తన మొదటి సినిమా ఫలితం గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని... ప్రశంసలను, విమర్శలను ఒకేలా స్వీకరించాలని శ్రీదేవి చెప్పిందని గుర్తు చేసుకుంది. తర్వాత ఓ బబ్లీ, స్టైలిష్ గర్ల్ గా...ఓ కమర్షియల్ సినిమాలో నటించాలని ఉందని చెప్పింది. అయితే, అవకాశం వస్తే ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేస్తానని....రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని అమ్మ చెప్పిందని జాన్వీ ఎమోషనల్ అయింది. ఎక్స్‌పోజింగ్ అంటే కేవలం అందాలను ఆరబోయడం కాదని, టూ పీస్ బికినీతో ఎక్స్ పోజింగ్ చేయొచ్చు....అదే సమయంలో గ్లామరస్‌గా కన్పించవచ్చని తెలిపింది. తాను గ్లామరస్ గా ఉండేలా అందాలు ఆరబోయడానికి ఇష్టపడతానంటోందీ ముద్దుగుమ్మ. మరోవైపు, జాన్వీతో బోనీకపూర్ ఓ మెగా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారట. `#ఆర్ ఆర్ ఆర్` లో కూడా జాన్వీని జక్కన్న లాక్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి.