Begin typing your search above and press return to search.

సౌత్‌ పై ఆసక్తి లేదనేసింది

By:  Tupaki Desk   |   3 Oct 2018 10:36 AM GMT
సౌత్‌ పై ఆసక్తి లేదనేసింది
X
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ త్వరలో ఒక తెలుగు సినిమాలో నటించబోతుంది అంటూ గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ కోసం మైత్రి మూవీస్‌ నిర్మాతలు ఈమెను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాన్వీ కపూర్‌ కూడా అందుకు ఓకే అన్నట్లుగానే వార్తలు వచ్చాయి. కాని అవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. తాజాగా జాన్వీ కపూర్‌ స్వయంగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది.

సౌత్‌ సినిమాలో తాను నటిస్తున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని - అసలు తాను సౌత్‌ సినిమాల గురించి ఆలోచించడం లేదని - ప్రస్తుతం తన ఫోకస్‌ మొత్తం బాలీవుడ్‌ పైనే అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈమె మాటలతో ఫుల్‌ క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్‌ ఇతర హీరోయిన్స్‌ మాదిరిగానే ఈమె కూడా సౌత్‌ పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, అక్కడ క్రేజ్‌ తగ్గినప్పుడు సౌత్‌ వైపు ఏమైనా చూస్తుందేమో అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు.

శ్రీదేవి లేని లోటును జాన్వీ కపూర్‌ అయినా తీర్చుతుందేమో అని సౌత్‌ ఆడియన్స్‌ కోరుకున్నారు. కాని ప్రేక్షకుల అంచనాలు తారుమారు చేస్తూ జాన్వీ కపూర్‌ అసలు సౌత్‌ పై ఆసక్తి లేనట్లుగా తేల్చి చెప్పడంతో ప్రేక్షకులు కాస్త నిరుత్సాహంకు గురవుతున్నారు. బాలీవుడ్‌ లో మంచి ఛాన్స్‌ లు వచ్చే ఏ హీరోయిన్‌ అయినా సౌత్‌ కు రావాలని కోరుకోదు. అదే విధంగా జాన్వీ కపూర్‌ కూడా అక్కడ మంచి ఆఫర్లు వస్తుంటే ఎందుకు వదిలేసి సౌత్‌ కు వస్తుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.