Begin typing your search above and press return to search.

సైఫ్ కూతురిని వదిలేసి శ్రీదేవి డాటర్ తో

By:  Tupaki Desk   |   11 March 2017 4:03 AM GMT
సైఫ్ కూతురిని వదిలేసి శ్రీదేవి డాటర్ తో
X
మాజీ అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రతీ న్యూస్ హాట్ టాపిక్ అయిపోతోంది. ఈ భామ బాలీవుడ్ అరంగేట్రం చేసే వరకూ ఈ హైప్ కొనసాగక తప్పదనే విషయం అర్ధమవుతోంది. గతంలో బాయ్ ఫ్రెండ్స్ తో జాన్వి బాగానే రచ్చ చేసేది కానీ.. ఈ మధ్య అమ్మ వార్నింగ్ తో కాస్త స్పీడ్ తగ్గించింది.

అక్షత్ రంజన్ అనే కుర్రాడితో జాన్వి డేటింగ్ చేసేస్తోందనే టాక్ ఉంది. ఒకట్రెండు సార్లు శ్రీదేవి ఫ్యామిలీ ఫోటోలో కూడా ఈ కుర్రాడు కనిపించాడు. అయితే.. తాజాగా జరిగిన ఓ సంఘటన అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బద్రీనాథ్ కి దుల్హనియా స్క్రీనింగ్ జరిగితే.. ఈ ప్రదర్శనకు సింగిల్ గా వచ్చింది జాన్వి. అంతవరకూ బాగానే ఉన్నా.. వెళ్లేటపుడు మాత్రం ఇషాన్ ఖట్టర్ తో కలిసి అక్కడి నుంచి చెక్కేసింది ఈ కుర్ర భామ. అక్కడే అందరికీ తేడా కొట్టేసింది. ఇంతకీ ఈ ఇషాన్ ఎవరో కాదు.. వరుసకు షాహిద్ కపూర్ కు తమ్ముడు అవుతాడు.

దాని కంటే కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే.. గత కొన్ని నెలలుగా ఈ ఇషాన్ ఖట్టర్- సైఫ్ అలీ ఖాన్ కూతురు సారాలు ప్రేమించుకుంటున్నారనే రూమర్ ఉంది. ఇద్దరూ కలిసి కెమెరాలకు చిక్కారు కూడా. ఇప్పుడు ఏమయిందో తెలీదు కానీ.. సారాను పక్కను పెట్టేసి.. శ్రీదేవి కూతురుతో తిరిగేస్తున్నాడు కుర్రాడు. ఉడ్తా పంజాబ్ లో చిన్న రోల్ చేసిన ఇషాన్ కూడా.. త్వరలో పూర్తి స్థాయిలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/