Begin typing your search above and press return to search.
క్రేజీ సీక్వెల్ లో ఎవరు నటిస్తారో..?
By: Tupaki Desk | 2 Sep 2022 2:30 AM GMTకోలీవుడ్ విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'పిజ్జా' 'పేట' 'జగమే తంత్రం' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చివరగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేరుగా విడుదలైన 'మహాన్' సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే 'జిగర్తాండ' చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించారు కార్తీక్.
2014 లో కార్తీక్ సుబ్బారాజు దర్శకత్వంలో యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ‘జిగర్తాండ’ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తీస్తే 35 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో బొమ్మరిల్లు సిద్దార్థ్ - బాబీ సింహా - లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరిశాడు
'జిగర్తాండ' విడుదలై ఆగస్టు 1వ తేదీకి ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నట్టు కార్తిక్ సుబ్బరాజ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే అప్పుడే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించే నటీనటుల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.
'జిగర్తాండ 2' సినిమాలో దర్శక హీరోలు రాఘవ లారెన్స్ మరియు ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్ లో నటించిన బాబీ సింహా కూడా ఈ సీక్వెల్ లో భాగం అవుతారని అంటున్నారు.
ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడే ఈ సినిమాలో నటీనటుల గురించి మాట్లాడటం తొందర అవుతుంది. ఈ క్రేజీ సీక్వెల్ లో ఎవరు నటిస్తారనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
ఇకపోతే 'జిగర్తాండ' సినిమాకి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ సహాయ నటుడిగా బాబీ సింహా.. ఎడిటింగ్ విభాగంలో వివేక్ హర్షన్ నేషనల్ అవార్డులు అందుకున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ‘గద్దల కొండ గణేష్’ పేరుతో రీమేక్ చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ - అధర్వ - పూజా హెగ్డే - మృణాళిని నటించారు.
తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇదే క్రమంలో ‘బచ్చన్ పాండే’ పేరుతో హిందీలో రీమేక్ చేయబడింది. అక్షయ్ కుమార్ - కృతి సనన్ - ఆర్షద్ వార్షీ నటించిన ఈ చిత్రం.. ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై దారుణ పరాజయం పాలైంది.
‘జిగర్తాండ’ కథ విషయానికి వస్తే.. ఓ అప్ కమింగ్ డైరెక్టర్ క్రూరమైన గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ ను నిర్మించాలనుకుంటాడు. దీని కోసం రియల్ లైఫ్ గ్యాంగ్ స్టర్ జీవితాన్ని అధ్యయనం చేయాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో భయంకరమైన విలన్ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరిగిందనేదే ప్రధాన కథాంశం. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ లో ఎలాంటి కథను చెప్పబోతున్నాడని అందరిలో ఆసక్తి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.