Begin typing your search above and press return to search.
జిల్ జంగ్ జక్.. నో హీరోయిన్
By: Tupaki Desk | 10 Sep 2015 7:54 PM GMTఈ హీరో కనిపించడు. వినిపించడు. ఉన్నట్టుండి సైలెంటుగా సినిమా చేస్తున్నా అంటూ ప్రచారానికొచ్చేస్తాడు. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలాడు. అంతలోనే మిడిల్ డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ సీనేలేదు. అయినా ఇప్పుడు చప్పబడిపోయాడు కానీ, ఎప్పుడూ వార్తల్లో ఉండేంతటి ట్యాలెంటు ఉన్న హీరో. మీడియా విషయంలో, కెరీర్ విషయంలో కొన్ని తప్పిదాలు చేసి అడ్డంగా బుక్కయి పోయాడు పాపం. అసలింతకీ ఎవరీ హీరో .. ఎవరైనా ఠకీమని చెప్పేయొచ్చు. ఇంకెవరండీ బాబూ..!! చాక్లెట్ బోయ్, లవర్ బోయ్ సిద్ధార్థ్ గురించే ఇదంతా.
సిద్ధార్థ్ అసలు ఏమయ్యాడు? వల వేసి పడదామంటే చేపల్లే చిక్కేట్టే కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిసరాల్లో అతడి జాడే లేదు. టాలీవుడ్ లో అతడితో సినిమాలే చేసేవాళ్లే లేకుండా పోయారు. అందుకే కనిపించడం లేదిక్కడ. అయితేనేం సొంత పరిశ్రమ ఆదరించింది. నిలబెడుతోంది. తమిళ్‌లో ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అప్పట్లో కొన్ని ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని తంబీల్లో బాగానే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు సిద్ధార్థ్. మరోసారి చర్చల్లోకి వచ్చే హీరో అయ్యేట్టే ఉన్నాడు లేటెస్ట్ ఎటెంప్ట్ చూస్తుంటే..
జిల్ జంగ్ జక్.. అంటూ ఈసారి కూడా మరో ప్రయోగం చేస్తున్నాడు. టైటిల్ బావుంది. ఇదో డార్క్ కామెడీ. హాలీవుడ్ తరహాలో కొత్తగా ఉంటుంది. బ్యాక్ డ్రాప్ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అయితే ఇందులో అస్సలు హీరోయిన్ ఉండనే ఉండదు. ప్రతి ఫ్రేములోనూ హీరోనే కనిపిస్తాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా కాబట్టే తనే స్వయంగా నిర్మించాడు. నటించాడు. హీరో కం ప్రొడ్యూసర్ సిద్ధార్థనే. టైటిల్ ఇంట్రెస్టింగ్. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్. ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉందింకా. ప్రయోగమే కాబట్టి ఏమవుతుందో.. ప్చ్!