Begin typing your search above and press return to search.
ఆ సినిమా చేసినోళ్ళందరూ విడిపోయారు
By: Tupaki Desk | 24 Jan 2016 7:30 AM GMTఐదేళ్ల క్రితం బాలీవుడ్ లో ఓ ముూవీ వచ్చింది. జిందగీ న మిలేగీ దుబారా అంటూ వచ్చిన ఆ సినిమా.. జంటలు విడిపోవడాలపైనే నడుస్తుంది. జిందగీ న మిలేగీ దుబారా యూనిట్ లో ఐదుగురి పరిస్థితి ఇదే. హ్రితిక్ రోషన్ - ఫరాన్ అక్తర్ - అభయ్ డియోల్ - కల్కి కోచిన్ - కత్రినా కైఫ్.. ఇప్పుడు అందరూ సింగిల్ గానే ఉన్నారు. మొత్తం అంతా తమ రిలేషన్స్ కి చెక్ చెప్పాల్సి వచ్చింది.
లేటెస్టుగా అయితే ఫరాన్ అక్తర్ తన భార్య అధునాతో విడిపోయాడు. పిల్లల భవిష్యత్తు కోసం పరస్పరం అంగీకరించుకుని.. 15 ఏళ్ల తమ కాపురానికి చెక్ పెట్టామని చెప్పాడు. వీరికి ముందు కత్రినా కైఫ్ - రణ్ బీర్ కపూర్ లు గుడ్ బై చెప్పేసుకున్నారు. కపూర్ ఫ్యామిలితో కేట్ మింగిల్ అవుతోందని అనుకుంటున్న టైంలోనే.. ఈ ఫ్లాష్ న్యూస్ కూడా వచ్చింది. తట్టా బుట్టా సర్దేసుకుని కేట్ ఫ్లాట్ నుంచి రణ్ బీర్ వెళ్లిపోయాడు కూడా.
గతేడాది తన గాళ్ ఫ్రెండ్ ప్రీతి దేశాయ్ కు గుడ్ బై చెప్పాడు అభయ్ డియోల్. దీని గురించి పబ్లిక్ గా ఏం చెప్పకపోయినా, బ్రేకప్ అంత ఈజీ కాదు, కానీ జీవితం కంటిన్యూ అవాలంటూ వేదాంతం కూడా మాట్లాడాడు. గతేడాది మే నెలలో భర్త అనురాగ్ కశ్యప్ కి విడాకులు ఇచ్చింది కల్కికోచ్లిన్. వీరందరి కంటే పెద్ద స్థాయిలో ఉన్న స్టార్ హీరో హ్రితిక్ రోషన్ అయితే.. తన భార్య సుజానేకు రెండేళ్ల క్రితం విడాకులిచ్చాడు. మరి వీరంతా ఒకే సినిమాకి పని చేయడం, అది కూడా విడిపోవడం పైనే కావడం, అందరికీ అదే పరిస్థితి రావడం వెనక.. జిందగీ న మిలేగీ దుబారా ఎఫెక్ట్ ఏమన్నా ఉందంటారా?