Begin typing your search above and press return to search.
జిన్నా వివాదం అవుతుందని ముందే తెలుసా?
By: Tupaki Desk | 15 Jun 2022 11:30 AM GMTమంచు వారికి ఈ మధ్య వివాదాలు కొత్తేమీ కాదు అన్నట్టుగా కనిపిస్తోంది. మంచు విష్ణు నటించిన'దేనికైనా రెడీ' మూవీ నుంచి మంచు వారి సినిమాల చుట్టూ వివాదాలు చుట్టుకుంటూనే వున్నాయి. మరి ఇవి కావాలనే వివాదం అవుతున్నాయో లేక వివాదం అవుతాయని ముందే తెలిసి ఈ తరహా సినిమాలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నది చాలా మంది వాదన. సమకాలీన హీరోల రేసులో వెనకబడిపోవడంతో కావాలనే వివాదాస్పద టైటిల్స్‌ని, కథాంశాలని మంచు విష్ణు ఎంచుకుంటున్నారా? అనే అనుమానాలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా నెటిజన్ లు కూడా ఇదే తరహా అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేసిన 'దేనికైనా రెడీ' మూవీలో సులేమాన్ పాత్రలో నటించిన మంచు విష్ణు వేశం మార్చి కృష్ఱశాస్త్రిగా మారడం అప్పట్లో పెను వివాదాన్ని సృష్టించింది. ఓ వర్గం వారు ఏకంగా కేసుల వరకు వెళ్లారు.. హెచ్చార్సీకి కూడా వెళతామని హెచ్చిరించారు కూడా. మీడియాలో దీనిపై పెద్ద దుమారమే రేగింది. చివరికి మోహన్ బాబు కలగజేసుకుని మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమించాలని చెప్పడంతో వివాదం సద్దుమనిగింది.
మళ్లీ అలాంటి వివాదమే మంచు విష్ణు నటిస్తున్న 'జిన్నా' టైటిల్ చుట్టూ మొదలైంది. ఇషాన్ సూర్యని దర్శకుడిగా పరిచయం చేస్తూ మంచు విష్ణు హీరోగా ఓ మూవీ రూపొందుతోంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే తాజాగా ఈ మూవీ టైటిల్ ని విభిన్నంగా ప్రకటించారు. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్ లని పరిచయం చేస్తూ ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేశారు.
ఇక్కడే వివాదం మొదలైంది. టైటిల్ లోగోని ఏకంగా ఏడుకొండల పైన పెట్టేసి చూపించడం వివాదానికి ప్రధాన కారణంగా మారింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ నాయకులు 'జిన్నా' టైటిల్ తో పాటు టైటిల్ ని ఏడుకొండలపై పెట్టి చూపించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. చిత్ర బృందానికి హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో రచయిత కోణ వెంకట్ టైటిల్ పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
హీరో పేరు గాలి నాగేశ్వరరావు అయితే అలా పిలిపించుకోవడం ఇష్టం లేక జిన్నా అని పిలిపించుకుంటాడని, అందుకే ఈ మూవీకి 'జిన్నా' అని పెట్టామని, ఇక తిరుపతిలో జరిగే కథ కాబట్టి టైటిల్ ని ఏడుకొండలపై పెట్టామని చెప్పుకొచ్చారు.
కోన వెంకట్ ఇచ్చిన వివరణ చాలా వింతగా వుందని బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చిత్ర బృందాన్ని హెచ్చరిస్తున్నారు. ఇదిలా వుంటే కావాలనే దేశ విభజనకు కారణమైన జిన్నా పేరుని టైటిల్ గా పెట్టుకున్నారని, ఆ టైటిల్ ని ఏడుకొండలపై పెడితే సినిమా మరింత వివాదంగా మారి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ముందే ప్లాన్ చేసి మరీ ఇలా చేశారని నెటిజన్ లు 'జిన్నా' టీమ్ ని ఘాటుగా విమర్శిస్తున్నారట. మంచు విష్ణు మాత్రం ఈ వివదాం పై ఇంత వరకు స్పందించకపోవడం గమనార్హం.