Begin typing your search above and press return to search.
జింతాక్ : రవితేజ - శ్రీలీల ఊర మాస్ అంతే!
By: Tupaki Desk | 18 Aug 2022 8:54 AM GMTమాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధమాకా'. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. 'డబుల్ ఇంపాక్ట్' అని ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంత వరకు తనదైన మార్కు కామెడీని మిక్స్ చేస్తూ లవ్ స్టోరీలని అందించిన త్రినాథరావు నక్కిన తొలి సారి తన జానర్ కు పూర్తి భిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది.
దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి మొదలైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అనే సంకేలాల్ని అందిస్తూ వస్తున్న ఈ మూవీ రవితేజ, శ్రీలీల ఫస్ట్ సాంగ్ 'జింతాక్..' పోస్టర్ తో మరింత ఆసక్తిని రేకెత్తించడం మొదలు పెట్టింది. సినిమా రిలీజ్ కు టైమ్ వున్న నేపథ్యంలో మేకర్స్ లిరికల్ సాంగ్స్ తో ప్రమోషన్స్ కి తెర లేపారు.
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీలపై చిత్రీకరించిన 'ఎంకన్న తీర్థంలో యూల పొద్దు మూహూర్తంలో..పూల జెడ ఎత్తుతుంటే.. పుస్తె నువ్వు కడుతుంటే..ఏ కన్నూ సూడకుండా..కన్ను నాకు కొడుతుంటే..నిన్ను చూడబుద్దైతాంది రాజిగో..మాటాడబుద్దైతాంది రాజిగో..జింతాక...జింతాక..' అంటూ సాగే లిరికల్ వీడియోని మేకర్స్ గురువారం విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్ అందించారు.
శేఖర్ వీజే డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పాటని భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ ఆలపించారు. 'రాములో రాములా..' అంటూ జానపద గీతాన్ని ఊర మాస్ సాంగ్ గా ప్రజెంట్ చేసిన అదరగొట్టిన కాసర్ల శ్యామ్ అదే పంథాలో 'ధమాకా' కోసం 'జింతాక్..' సాంగ్ ని అందించడం విశేషం. ఊర మాస్ నంబర్ గా ట్యూన్ చేసిన ఈ సాంగ్కు అదే స్థాయిలో మాస్ స్టెప్పులతో మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ శ్రీలీల అదరగొట్టేశారు. భీమ్స్ అందించిన మాస్ బీట్ లకు రవితేజతో కలిసి మాస్ స్టెప్పులేస్తూ శ్రీలీల పోటీపడిన తీరు ఆకట్టుకుంటోంది.
థీయేటర్లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఓ ఊపు ఊపేయడం ఖాయం. ఈ పాటలో రవితేజ, శ్రీలీల ల కెమిస్ట్రీ కూడా అదరింఇది. ఇద్దరి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ ఫిదా కావడం గ్యారంటీ. సాధారణంగా మాస్ బీట్ సాంగ్స్ ని సెట్ లలో లోకల్ లొకేషన్ లలో షూట్ చేస్తారు. కానీ ఈ పాటని విదేశీ డ్యాన్సర్స్ మధ్య విదేశీ లొకేషన్స్ లో చిత్రీకరించడం విశేషం.
సాంగ్ లొకేషన్స్ కూడా పాటకు తగ్గట్టుగా బాగా కుదిరాయి. దీంతో సాంగ్ చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని అందించింన ఫొటోగ్రఫీ, భీమ్స్ సంగీతం ఈ పాటకు ప్రధాన హైలైట్స్ గా నిలవనున్నాయి.