Begin typing your search above and press return to search.

రాజీ రేంజ్ లో లేదంటున్నారు

By:  Tupaki Desk   |   5 April 2019 8:24 AM GMT
రాజీ రేంజ్ లో లేదంటున్నారు
X
ఇవాళ మజిలీ సందడిలో తెలుగు ప్రేక్షకులు ఉన్నారు కానీ బాలీవుడ్ నుంచి రా - రోమియో అక్బర్ వాల్టర్ కూడా విడుదలైంది. జాన్ అబ్రహం హీరోగా ఇండో పాక్ నేపధ్యంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ చూశాక అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. నిన్నే ముంబైలో ప్రీమియర్ షోస్ ప్రముఖుల కోసం వేసేశారు. అయితే టాక్ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం అభిమానులకు కలత కలిగించేదే.

కథ విషయానికి వస్తే బ్యాంకు ఉద్యోగి అయిన రోమియో(జాన్ అబ్రహం)రా ఆఫీసర్ అయిన శ్రీకాంత్ రాయ్(జాకీ ష్రాఫ్)ఆదేశాల మేరకు పాకిస్తాన్ కు రా ఏజెంట్ గా వెళ్లి అక్కడ అక్బర్ గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. భారత్ మీద చేయబోయే దాడుల గురించి అక్బర్ తెలుసుకుంటాడు.ఇక అక్కడి నుంచి ప్రతి క్షణం ప్రాణాంతకంగా మారుతుంది. అనుకున్న లక్ష్యం నేరవేర్చుకున్నాడా అక్బర్ వాల్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది తిరిగి రోమియో దేశానికి వచ్చాడా లేదా అనేదే బాలన్స్ కథ

సరిగ్గా ఇంచుమించు ఇదే పాయింట్ తో గత ఏడాది అలియా భట్ టైటిల్ రోల్ చేసిన రాజీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాని స్థాయిలో రా లేదనే పెదవి విరుపు క్రిటిక్స్ నుంచి ఎదురవుతోంది. స్క్రీన్ ప్లే మరీ స్లోగా ఉందని ఇంటెన్సిటీ బదులు అనవసరమైన ఎమోషన్స్ కు చోటివ్వడంతో రా గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా మిగలాల్సింది పోయి నిస్సారంగా మారిందని చెబుతున్నారు. జాన్ అబ్రహం పెర్ఫార్మన్స్ పరంగా ఏ లోపమూ లేనప్పటికీ చాలా సన్నివేశాలకు లాజిక్ ని పక్కన పెట్టడంతో పాటు పాత్రల మధ్య గందరగోళం ఫీల్ ని తగ్గించేసింది. 1971 నేపధ్యాన్ని పూర్తిగా రీ క్రియేట్ చేయడంలో సైతం దర్శకుడు రోబీ గ్రేవాల్ ఫెయిల్ కావడంతో జాన్ అబ్రహం రేంజ్ లో రా నిలవలేకపోయిందని బాలీవుడ్ టాక్.