Begin typing your search above and press return to search.

రాకీ హ్యాండ్సమ్ తెలుగు రీమేక్ లో ఎవరు?

By:  Tupaki Desk   |   21 Jan 2016 5:30 PM GMT
రాకీ హ్యాండ్సమ్ తెలుగు రీమేక్ లో ఎవరు?
X
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం యాక్టర్ గానే కాదు.. నిర్మాతగా కూడా సక్సెస్ ఫుల్ పర్సన్. ఇప్పుడు జాన్ అబ్రహం చేస్తున్న రాకీ హ్యాండ్సమ్ మూవీ.. బాలీవుడ్ ప్రమాణాలను మరో అడుగు పైకి తీసుకుళుతుందనే అంచనాలున్నాయి. స్టోరీ - స్క్రిప్ట్ - యాక్షన్ సన్నివేశాలు పక్కగా ఉండడంతో.. ఈ రాకీ హ్యాండ్సమ్ ను దక్షిణాది భాషల్లో కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు జాన్. సాధారణంగా తమ మూవీపై నమ్మకం ఉన్న నిర్మాతలు తెలుగు - తమిళ్ వంటి భాషల్లో డబ్బింగ్ వెర్షన్ ను వదులుతుంటారు. కానీ జాన్ అబ్రహాం మాత్రం ఈ స్టోరీపై నమ్మకంతో రీమేక్ కే మొగ్గు చూపుతుండడం విశేషం.

'మేం ఈ మూవీని దక్షిణాదిలో కూడా రీమేక్ చేయాలని అనుకుంటున్నాం. సూపర్ స్టార్స్ కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. హైద్రాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈ మూవీని చూశాడు కూడా. ఇది పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ కావడంతో తెలుగు, తమిళ్ నుంచి ఇద్దరు ముగ్గురు ఇప్పటికే రీమేక్ పై ఆసక్తి చూపుతున్నారు.' అంటున్నాడు జాన్ అబ్రహాం. అయితే.. ఎవరి నుంచి ఇలాంటి ప్రపోజల్ వచ్చిందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. కానీ ఈ మూవీ చేయడం అంత తేలికేం కాదంటున్నాడీ బాలీవుడ్ స్టార్. తను ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడట. టాయ్ చీ, అకీడో విద్యలపై రోజుకు 14 గంటల చొప్పున నెల రోజుల పాటు ట్రైనింగ్ అయ్యాకే ఈ రోల్ చేశానంటున్నాడు.

అంతే కాదు ఈ ట్రైనింగ్ చాలా క్లిష్టంగా ఉంటుందని, కొన్ని ఫార్మేషన్స్ తప్పనిసరిగా రావడంతో పాటు..కత్తులతో ఆటలాడుకునే స్థాయికి ట్రైనిగ్ అవ్వాలని చెబుతున్నాడు. మరి ఇంతగా తెలుగులో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ అయ్యి మరీ సినిమా చేసేందుకు ఉత్సాహం చూపుతున్న హీరో ఎవరనే విషయం మాత్రం రివీల్ కాలేదు. అయితే.. జాన్ అబ్రహాం చెప్పిన ఎమోషన్ చూస్తే మాత్రం.. రాకీ హ్యాండ్సమ్ తెలుగులో రావడం ఖాయమే అనిపిస్తోంది.