Begin typing your search above and press return to search.
ఆ స్టంట్ల కోసం మూడు సర్జరీలు!!
By: Tupaki Desk | 7 Nov 2016 1:22 PM GMTసినిమాలో యాక్షన్ సన్నివేశాలను పండించడానికి కొందరు హీరోలు తామే సర్వం అన్నట్లు రిస్కు చేస్తుంటారు. అదిగో అందుకే వారు గాయాలపాలై అనేక నెలలు రెస్ట్ తీసుకుంటూ ఉండిపోతారు కూడా. అదిగో అప్పట్లో ఎన్టీఆర్.. ఈ మధ్యన వరుణ్ తేజ్.. అందరి విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం కూడా నేనేం తక్కువకాదు అంటున్నాడు.
ఇప్పుడు జాన్త న ట్విట్టర్ ద్వారా ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో మనోడి మోకాలికి డాక్టర్లు సర్జరీ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. ఆ మధ్యన ఘర్షణ సినిమాను ఫోర్స్ అంటూ రీమేక్ చేసిన జాన్.. ఇప్పుడు ఫోర్స్ 2 అంటూ ఆ సినిమాకు ఒక సీక్వెల్ తో వస్తున్నాడు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లు చేస్తున్నప్పుడు.. మోకాలికి మూడు సర్జరీలు చేయించుకున్నాడట మనోడు. ముఖ్యంగా హంగేరీ రాజధాని బుడాపెస్టులో షూటింగ్ టైములో కాలికి భారీ గాయమే అయ్యింది. గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్ చేయడంతో.. మరోసారి ఆ గాయం లోపల ఒక అంగుళం పాటు రక్తం గడ్డ కట్టేసింది. సినిమా కోసం బ్లడ్ అండ్ స్వెట్ చిందిస్తాం అని చెబుతాం కదా.. అది ఇదే అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు జాన్.
అభినయ్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ ''ఫోర్స్ 2''లో సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే అమ్మడు తన హాట్ సోయగాలతో రచ్చ లేపేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/