Begin typing your search above and press return to search.
జాన్ భాయ్ అతడిని చూసి నేర్చుకోవాలి!
By: Tupaki Desk | 6 April 2022 4:04 AM GMTపబ్లిక్ లో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఒక్కో పదం ఉపయోగించాలి. లేదంటే మనోభావాలు దెబ్బ తినేస్తాయి. ఎక్కడ తేడా కొట్టినా సోషల్ మీడియా ప్రపంచంలో వార్ నడుస్తున్న రోజులివి. అయితే ఈ విషయంలో అప్పుడప్పుడు తప్పులు చేసి దొరికిపోయే హీరోలకు కొదవేమీ లేదు. ఆత్మాభిమానం ప్రదర్శించడం సరే కానీ.. సందర్భానుసారం కొంతైనా ఒదిగి ఉండకపోతే మాట తీరును తప్పు పడతారు. అలాంటి అనుభవమే ఎదురైంది బాలీవుడ్ సింహబలుడు జాన్ అబ్రహాం కి. అతడు చక్కని నటుడు.. హిందీ హీరోనే.. కానీ ప్రాంతీయ సినిమాలో నటించను అని మాట్లాడాడు. అది రాంగ్ సౌండింగ్ తో హర్ట్ చేసింది.
అయితే అదే ప్రశ్నను షాహిద్ ని అడిగితే ఎంతో తెలివిగా సమాధానమిచ్చాడు. తెలుగు తమిళం నుంచి భారీ చిత్రాలొస్తున్నాయి. కానీ నా సినిమా కథాంశం కంటెంట్ వేరు. ఏ సినిమాకి ఉండే స్కోప్ ఆ సినిమాకి ఉంటుంది! అంటూ తెలివైన ఆన్సర్ ఇచ్చాడు. అలాగే పుష్ప చూశాక అల్లు అర్జున్ కి ఫ్యాన్ అయిపోయానని తనతో కలిసి నటించాలనుందని కూడా అన్నాడు. అటు తమిళంలో దళపతి విజయ్ డ్యాన్సులు అంటే పడి చస్తానని.. తనకు వీరాభిమానిని అని కూడా అన్నాడు.
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఇంతకీ ఏమన్నాడు?
జాన్ భాయ్ ఏమన్నాడు? అన్నది పరిశీలిస్తే.. అతడు తనకు ప్రాంతీయ సినిమాలో నటించే ఆలోచన లేదని తాను హిందీ హీరోని మాత్రమేనని అన్నాడు. భవిష్యత్ లో ప్రాంతీయ సినిమాలో నటించనని నిష్కర్షగా చెప్పేశాడు. అయితే అతడు చెప్పిన విధానం సౌత్ ని హర్ట్ చేసింది.
RRR తో తన చిత్రం ఎటాక్ పోటీ బరిలో ఉండడంపై విలేఖరి అడిగిన ప్రశ్నకు అతడు స్పంఇస్తూ...రాజమౌళి అంటే తనకు చాలా గౌరవం అని వారి హార్డ్ వర్క్ పై చాలా గౌరవం ఉందని జాన్ సమాధానమిచ్చాడు. అయితే మేం కచ్చితంగా ఎవరికీ నెం.2 కాదు! అంటూ ఆత్మాభిమానం చాటుకున్నారు. అంతా బాగానే ఉన్నా వేరొక ప్రకటనతో సౌత్ సినీ ప్రేక్షకులలో ఆగ్రహానికి కారకుడయ్యారు. నేను తెలుగు లేదా ఏ ప్రాంతీయ సినిమానూ చేయను. నేను హిందీ సినిమా హీరోని. నేనెప్పుడూ అక్కడ సెకండ్ లీడ్ గా సినిమా చేయను అని అన్నారు.
ఇక ఇదే ప్రశ్న షాహిద్ కి ఎదురైంది. KGF 2 - బీస్ట్ తో జెర్సీ బాక్సాఫీస్ క్లాష్ గురించి ప్రచార వేడుకలో విలేఖరి అడిగారు. షాహిద్ స్పందిస్తూ.. ఇది మంచి సమయం అని భావిస్తున్నాం. సౌత్ లోనూ విడుదల చేయడం వారికి మంచి సమయంగా భావించారు. రెండింటినీ కలిపి చూసినా ప్రతి ఒక్కరి సినిమాకు తగినంత స్కోప్ ఉంటుందని నేను భావిస్తున్నాను... అని అన్నారు.
విజయ్ సర్ బీస్ట్ ఒక అద్భుతమైన చిత్రం అవుతుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.. కానీ అది కాస్త భిన్నమైన మార్కెట్ కి సంబంధించినది. అక్కడ అంతగా అతివ్యాప్తి జరుగుతుందని నేను అనుకోను అని కూడా తెలివిగా షాహిద్ అన్నాడు. KGF 2 రిలీజ్ సందర్భంగా యష్ కు శుభాకాంక్షలు తెలిపాడు. "ఇది విభిన్నమైన శైలి ఉన్న సినిమా. భారీ యాక్షన్ తో ఉద్వేగభరితమైన చిత్రం.. అయితే మాది కుటుంబ కథా చిత్రం.. సందేశంతో కూడిన భావోద్వేగ స్పోర్ట్స్ డ్రామా... కాబట్టి ఎవరికి వారికి వోన్ స్పేస్ ఉందని నేను భావిస్తున్నాను. ఇది బిగ్ డే. నాలుగు సెలవులు ఉన్నాయి. అన్ని చిత్రాలకు థియేటర్లలో తగినంత స్కోప్ ఉంది. అవన్నీ బాగా ఆడాలి. పెద్ద సినిమాలు కలిసి రావడం గొప్ప విషయం. మేము దానిని సానుకూల దృక్పథంలో చూడాలి" అని అన్నారు.
ఇలా షాహిద్ చెప్పిన సమాధానం హృదయాలను గెలుచుకుంది. ప్రశాంతంగా జవాబిచ్చాడు. షాహిద్ -మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన జెర్సీ ఈ నెలలో విడుదల కానుంది. దక్షిణాది పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ ఘర్షణలో జెర్సీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు.
బన్ని- విజయ్ సర్ అంటే అభిమానం!
జెర్సీ నటుడు అల్లు అర్జున్ పై షాహిద్ కపూర్ ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నానని 'శ్రీవల్లి' పాట 'ఝుకేగా నహీ' యాక్ట్ లో గడ్డం కింద చేతితో ఆ హుక్ స్టెప్ చేయాలనుకుంటున్నానని కూడా చెప్పాడు. షాహిద్ తనకు దళపతి విజయ్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. నేను విజయ్ కి వీరాభిమానిని. ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అతను గొప్ప డ్యాన్సర్ .. నాకు మంచి డ్యాన్స్ చేయడానికి అతడిని పరిశీలిస్తాను అని కూడా అన్నారు.