Begin typing your search above and press return to search.

బాహుబలి2.. రంగంలోకి వాళ్లెందుకో!

By:  Tupaki Desk   |   11 Jun 2016 5:30 PM GMT
బాహుబలి2.. రంగంలోకి వాళ్లెందుకో!
X
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో చూశాం. ప్రతీ ఒక్కరికీ లాభాల పాట పండించిన ఈ సినిమాకి సీక్వెల్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. బాహుబలి సాధించిన విజయం తమపై బోలెడంత బాధ్యతను పెంచిందని నిర్మాత శోభు యార్లగడ్డ ముందునుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు రెండో భాగానికి సంబంధించి క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణకు రంగం సిద్ధమవుతోంది.

బాహబలి ది కంక్లూజన్ కి క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం కానున్న సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అంటూ.. అప్డేట్స్ ను ట్వీట్ చేశారు శోభు. 'బాహబలి2 క్లైమాక్స్ ను జాన్ గ్రిఫిత్ ప్రివిజువలైజ్ చేశారు. ఈయన ప్లానెట్ ఆఫ్ ఏప్స్.. ఎక్స్ మెన్ ఫ్రాంచైజీ లను వర్క్ చేశారు' అంటూ ట్వీట్ చేశారు నిర్మాత. నిజానికి బాహుబలికి సంబంధించినంత వరకూ గ్రాఫిక్స్ తో సహా అన్ని పనులను లోకల్ గానే పూర్తి చేశారు. కానీ బాహుబలి2 కోసం మాత్రం హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దిగిపోతున్న విషయం గమనించాలి.

బాహుబలి మొదటి భాగంపై అంచనాలున్నా అవన్నీ ఓ స్థాయిలోనివే. కానీ సీక్వెల్ విషయానికి వచ్చేసరికి.. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఎక్స్ పెక్టేషన్స్ కూడా హద్దులు దాటిపోయాయి. అందుకే ఆడియన్స్ ను థ్రిల్ చేసేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది బాహుబలి యూనిట్.