Begin typing your search above and press return to search.

పెళ్లాంతో క‌ల‌త‌లు.. లాయ‌ర్ తో ల‌వ్ లో ప‌డ్డ స్టార్ హీరో!

By:  Tupaki Desk   |   23 Sep 2022 3:54 AM GMT
పెళ్లాంతో క‌ల‌త‌లు.. లాయ‌ర్ తో ల‌వ్ లో ప‌డ్డ స్టార్ హీరో!
X
ఓవైపు భార్య‌తో క‌ల‌త‌లు అంత‌కంత‌కు పెద్ద‌వ‌వుతున్నాయి. కోర్టులు గొడ‌వ‌లు తీర్పులు అంటూ ఒక‌టే హంగామా .. మీడియా ర‌చ్చ‌. ఇంత ర‌చ్చ‌వుతుంటే ఆ క‌ల‌త‌ల‌న్నీ మ‌రిచి హాయిగా అత‌డు త‌న‌ను డిపెండ్ చేయ‌డానికి వ‌చ్చిన డిఫెన్స్ లాయ‌ర్ తో ప్రేమ‌లో మునిగాడు స‌ద‌రు స్టార్ హీరో. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరో? అంటే ది గ్రేట్ జానీ డెప్.

పేజ్ సిక్స్ క‌థ‌నం ప్రకారం.., జానీ డెప్ తన న్యాయవాది జోయెల్ రిచ్ తో డేటింగ్ చేస్తున్నాడని నిర్ధార‌ణ అయ్యింది. డెప్ గతంలో ది సన్ పై UK పరువు న‌ష్టం కేసులో న్యాయ‌వాదుల‌తో స్నేహం కుదిరింది. మాజీ భార్య అంబర్ హర్డ్ పై డెప్ కేసు వర్జీనియా న్యాయస్థానంలో బెంజమిన్ చెవ్ - కెమిల్లె వాస్క్వెజ్ లు అతనికి చట్టపరమైన ప్రతినిధులుగా మారడంతో అప్ప‌టికి రిచ్ - డెప్ లకు వాణిజ్యప‌ర‌మైన‌ సంబంధాలు లేవు.

అప్ప‌ట్లోనే డెప్ ఇత‌ర మ‌హిళా లాయ‌ర్ల‌తో సంబంధం క‌లిగి ఉన్నాడ‌ని ప్ర‌చార‌మైంది. లండన్ కు చెందిన న్యాయవాది వాస్కెజ్ ప్రస్తుతానికి ఆమె భాగస్వామి నుండి విడిపోయారు. విడాకులు ఇంకా ఖరారు కాకపోయే అవకాశం ఉంది. ఓ టెలివిజన్ విచారణ సమయంలో డెప్ - వాస్క్వెజ్ ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా కనిపించారు. దీంతో డెప్ తన US ప్రతినిధి కామిల్లె వాస్క్వెజ్ తో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లను నమ్మి పెయిడ్ ఇంటర్నెట్ లు వార్త‌లు రాయ‌డం ఆశ్చర్యం కలిగించింది.

అయినప్పటికీ డెప్ డేటింగ్ ధృవీకరణతో వాస్క్వెజ్ తన క్లయింట్ తో సంబంధాన్ని కలిగి ఉన్నార‌ని.. ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. అయినప్పటికీ 50 మిలియన్ల డాల‌ర్ల‌ పరువు న‌ష్టం కేసులో హియర్డ్ పై అసాధార‌ణ‌ విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలలో వాస్క్వెజ్ తో డెప్ డేటింగ్ పుకార్లను ప్రస్తావించారు. హెర్డ్ మాట్లాడుతూ అతడిని సెక్సిస్ట్ అని అనైతికవాది అని పిలుస్తూ... ఇద్దరి పైనా గుసగుస‌ల‌ను వైర‌ల్ చేసింది.

ఇంతలో US విచారణ సమయంలో డెప్ కి తన మద్దతును చూపించడానికి రిచ్ హాజరయ్యారని ఒక సోర్స్ ప్ర‌ముఖ అమెరిక‌న్ వీక్లీ మ్యాగ‌జైన్ కి తెలిపింది.

ఆమె అక్కడ ఉండటానికి వృత్తిపరమైన బాధ్యత ఏమీ లేదు... కానీ అక్క‌డ‌కు త‌న కోసం వ‌చ్చింది! అని స‌న్నిహిత‌ వ్యక్తి పేర్కొన్నాడు. సంబంధం ప్రారంభ దశలలో ఈ జంట హోటళ్లలో 'విచక్షణతో' కలుసుకునేవారు. కాల‌క్ర‌మంలో వారి మ‌ధ్య‌ కెమిస్ట్రీ ముదిరింది. ఇది వారి మధ్య తీవ్రంగా మారింది.. అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.