Begin typing your search above and press return to search.
సెట్ లో సిబ్బందిపై `హీరో`ఇజం...కేసు!
By: Tupaki Desk | 10 July 2018 4:49 PM GMTహాలీవుడ్ నటుడు జానీ డెప్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ లో జాక్ స్పారో పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన జానీ డెప్...పలు విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. అయితే, కొంతకాలంగా జానీ డెప్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. తన మాజీ మేనేజర్లు - లాయర్లు....నగదు లావాదేవీల్లో తనను మోసం చేసి కోట్ల రూపాయలు నొక్కేశారని...వారిపై కోర్టు లో కేసు వేశాడు. తాజాగా - తన అనుచిత ప్రవర్తనతో జానీ డెప్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ చిత్ర షూటింగ్ సందర్భంగా తనను జానీ డెప్ ....దూషించాడని - దాడిచేసి పిడిగుద్దులు గుద్దాడని లొకేషన్ మేనేజర్ ఒకరు కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా, డెప్ పై కేసు పెట్టినందుకు తనను ఆ చిత్ర నిర్మాతలు అర్ధంతరంగా తొలగించారని ఆరోపించారు.
ఏప్రిల్ 13, 2017న లాస్ ఏంజిల్స్ లో ‘సిటీ ఆఫ్ లైస్’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అక్కడ షూటింగ్ కు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో షూటింగ్ కు నిర్దేశించిన సమయం మించిపోయిందని...త్వరగా షాట్ ముగించాలని తాను జానీ డెప్ కు చెప్పానని, దీంతో అతడు తనపై దాడి చేశాడని లొకేషన్ మేనేజర్ గ్రెగ్ బ్రూక్స్ ఆరోపించాడు. తనను దుర్భాషలాడుతూ పిడిగుద్దులు కురిపించాడని కేసు పెట్టాడు. అయితే, ఈ ఘటనపై కేసు పెట్టవద్దని దర్శక - నిర్మాతలు తనకు చెప్పారని - కానీ, తాను వెనక్కు తగ్గనని స్పష్టం చేశానని అన్నారు. ఆ అక్కసుతో తనను ఆ సినిమా నుంచి తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, తనను దూషించే సమయంలో జానీ డెప్ మద్యం సేవించి ఉన్నారని, షూటింగ్ కు వచ్చేటప్పుడు డ్రగ్స్ తీసుకుని వస్తాడని షాకింగ్ ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై జానీ స్పందించలేదు. మరోవైపు, 1997లో జరిగిన ఓ హత్య కేసు నేపథ్యంలో సాగే డిటెక్టివ్ డ్రామాగా తెరకెక్కుతోన్న‘సిటీ ఆఫ్ లైస్’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమైంది.