Begin typing your search above and press return to search.
25 ఏళ్ల ముద్దుగుమ్మతో 55 ఏళ్ల స్టార్ పెళ్లి
By: Tupaki Desk | 26 April 2019 5:02 AM GMTహాలీవుడ్ స్టార్ జానీ డెప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక క్రేజ్ ఉన్న 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్' చిత్రం అయిదు పార్ట్ లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును దక్కించుకున్నాడు. అద్బుతమైన క్రేజ్ ను దక్కించుకోవడమే కాకుండా, తన నటననకు గాను ఆస్కార్ అవార్డును సైతం అందుకున్నాడు. సినిమాల్లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న జానీ డెప్ నిజ జీవితంలో మాత్రం వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, వారితో విడాకులు కూడా తీసుకున్నాడు. వైవాహిక జీవితంలో జానీ డెప్ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం లేదు.
2017వ సంవత్సరంలో అంబర్ హార్ట్ నుండి జానీ డెప్ విడిపోయాడు. ఇటీవలే అంబర్ హార్ట్ మీడియాతో మాట్లాడుతూ జానీ డెప్ తనను చిత్రవద చేశాడు, డ్రగ్స్ కు బానిస అయ్యి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. డ్రగ్స్ మానేస్తానని చాలా సార్లు నాకు హామీ ఇచ్చి, ఆ హామీని నిలుపుకోలేక పోయాడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. జానీ డెప్ మాజీ భార్య అంబర్ హార్ట్ చేసిన ఆరోపణల కారణంగా సినిమా ఆఫర్లు కోల్పోతున్నాడు. ఇప్పటికే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ నుండి ఈయన్ను తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో జానీ డెప్ రష్యన్ డాన్సర్ అయిన పోలినా ప్రేమలో జానీ డెప్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
గత ఏడాది కాలంగా పోలినాతో జానీ డెప్ ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలను ప్రచురిస్తున్నాయి. అయితే పోలినా వయసు 25 సంవత్సరాలు కాగా, జానీ డెప్ వయసు 55 సంవత్సరాలు. ఇద్దరి మద్య 30 ఏళ్ల గ్యాప్ ఉన్న కారణంగా వీరిద్దరి సంసార జీవితం ఎంత వరకు సాఫీగా సాగుతుందనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పోలినాతో పెళ్లి విషయంను మాట్లాడేందుకు జానీ డెప్ రష్యాకు వెళ్లబోతున్నట్లుగా హాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుందట. ప్రస్తుతం సినిమా కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా కూడా జానీ డెప్ కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ పరిణామాల నుండి పోలినాను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా బయట పడేనా చూడాలి.