Begin typing your search above and press return to search.
భార్యపై కసి తీర్చుకున్న కరేబియన్ స్టార్!
By: Tupaki Desk | 7 Jun 2022 11:30 PM GMTకోపంలో జరగరాని అనర్ధాలు జరిగిపోతుంటాయి. ఆ కోపానికి కారణాలు అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఆ కోపోద్రేకం చల్లారిన తర్వాత రియలైజ్ అవుతుంటాం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇది ఎవరి జీవితంలోనైనా సహజమే. తాజాగా ఓ హాలీవుడ్ స్టార్ లైఫ్ లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళ్తే...
`పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` సిరీస్ తో పాపులర్ అయిన హాలీవుడ్ నటుడు జానీడెప్ సుపరిచితుడే. అయితే ఇటీవలే అతని మాజీ భార్య మీద పరువు నష్టం కేసు వేసి గెలిచాడు. దీంతో జానీ ఆనందానికి అవధుల్లేవ్. కేసు గెలిచిన ఆనందంలో బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. దీంతో జానీ స్నేహితుడు..మ్యూజిక్ డైరెక్టర్ జెఫ్ బెక్ తో కలిసి బర్మింగ్ హమ్ లోని ఓ భారతీయ హోటల్ కి వెళ్లారు.
ఇష్టమైన వంటకాలన్నింటిని ఇద్దరు కలిసి లాగించేసారు. చికెన్..మటన్..ఫిష్...ఇలా ఇండియాన్ నాన్ వెజ్ వంటకాలన్ని ఆరగించారు. బిల్లు కూడా ఎక్కువగానే అయింది. మహా అయితే వీరిద్దరు కలిసి తిన్నది వేలల్లో ఉంటుంది. కానీ జానీ డెప్ హోటల్ బిల్లు గా ఎంత పే చేసాడో తెలుసా? అక్షరాలా 50 వేల పౌండ్లు. అంటే భారతీయ కరెన్సీలో 48 లక్షలు అవుతుంది.
ఆ డబ్బు మొత్తం బిల్లు దగ్గర పెట్టి వెళ్లిపోయాడు. మిగతా డబ్బు మొత్తం వెయిటర్ టిప్పుగా ఉంచుకునేలా వదిలి వెళ్లాడు అన్నమాట. ఇంత భారీ డబ్బు చూసి హోటల్ సిబ్బంది షాక్ అయింది. జానీ డెప్ లాంటి నటుడు తమ హోటల్ లో భోజనం చేయడమే గొప్ప అంటే ఇంత భారీ డబ్బు ఇవ్వడం..? పైగా టిప్పుగా అంత చెల్లించడంతో అంతా షాక్ అవుతున్నారు.
కరేబియన్ స్టార్ కి ఏమైనా మతి చెడిందా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే జానీ డెప్ ఉద్దేశం అది అయి ఉండదు. మాజీ భార్య రూపంలో భారీగా డబ్బు వచ్చింది. పరువు నష్టం పేరుతో అప్పనంగా వచ్చిన సొమ్ము అది. కష్టపడి సంపాదించింది కాదు. దాన్ని ఈ రకంగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే డబ్బుని ఇలా ఖర్చు చేయడంపై అతనిపై నెగివిటీ స్ప్రెడ్ అవుతుంది. భార్యపై కసితోనే జానీ ఈ డబ్బుని ఇలా ఖర్చు చేస్తున్నాడని అంటున్నారు. కారణాలు ఏవైనా జానీడెప్ కి మనీ విలువ అస్సలు తెలియలేదు సుమీ. ఇంకో విషయం ఏంటంటే? అసలు జానీ తిన్నదానికి అసలు ఖర్చు ఎంత అయిందన్నది ఇప్పటివరకూ హోటల్ సిబ్బంది బయట పెట్టలేదంట. ఆ విషయం చెబితే వాటా దారులేమైనా వస్తారన్న సందేహమో! ఏమో.