Begin typing your search above and press return to search.
ఇరట్ట నటుడిని అంత ఇచ్చి దించుతున్నారా..?
By: Tupaki Desk | 17 March 2023 12:00 PM GMTమలయాళంలో ఓటీటీ రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా ఇరట్ట. ఆ సినిమాలో నటించిన జోజు జార్జ్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఒక సినిమా బాగుంది అని టాక్ వస్తే చాలు వెతికి మరీ ఆ సినిమా చూసేయడం తెలుగు ఆడియన్స్ కి అలవాటే.
ఇరట్ట సినిమాకు పాజిటివ్ టాక్ రాగా తెలుగు ఆడియన్స్ ఎగ్జైట్ మెంట్ ని కనిపెట్టిన నెట్ ఫ్లిక్స్ ఇరట్ట తెలుగు వెర్షన్ ని అందుబాటులోకి తెచ్చింది. ఆ సినిమా కథ తెలుగులో తీయడం కష్టమని అంటారు కానీ ఇతర భాషల వారు తీస్తే మాత్రం ఆదరిస్తారు.
సినిమాలో డ్యుయల్ రోల్ లో జోజు జార్జ్ మాత్రం అదరగొట్టేశాడు. ఈ సినిమా తర్వాత అతనికి మిగతా భాషల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ నుంచి జోజు జార్జ్ కి పిలుపు వచ్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో జోజు జార్జ్ ని తీసుకున్నారు.
సినిమాలో విలన్ గా అతన్ని ఎంపిక చేశారు. ఈ సినిమాలో నటించేందుకు గాను జోజు జార్జ్ కి కోటిన్నర దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మలయాళ పరిశ్రమలో నటీనటులకు రెమ్యునరేషన్ తక్కువగా ఉంటుంది.
జోజు జార్జ్ ఇరట్ట సినిమాకు కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారట. అలాంటిది అతన్ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట మేకర్స్. మెగా హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి జోజు జార్జ్ తెలుగులో బిజీ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ధమకా హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ లీల మహేష్, బాలకృష్ణ సినిమాలతో పాటుగా వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో శ్రీ లీల టాప్ ప్లేస్ కు వెళ్లడం పక్కా అని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.