Begin typing your search above and press return to search.

'లైగ‌ర్' బ్యూటీపై జోక్...చుంకీ పాండే ఫీల‌య్యాడా?

By:  Tupaki Desk   |   11 May 2022 6:38 AM GMT
లైగ‌ర్ బ్యూటీపై జోక్...చుంకీ పాండే ఫీల‌య్యాడా?
X
యంగ్ హీరోయిన్ అన‌న్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. చుంకీ పండే..భావ‌నా పాండే కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు కుర్ర నాయిక‌ల్లో అంద‌రిక‌న్నా యాక్టివ్ గా దూసుకుపోతుంది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్' తో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుని పూల బాట నిర్మించుకుంది. 'లైగ‌ర్' సినిమాతో యువ నాయిక టాలీవుడ్ లోనూ లాంచ్ అవుతుంది. పూరి జ‌గ‌న్నాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది.

ఇక బ్యూటీ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిత్యం టెంప్టింగ్ ఫోటోల‌తో యువ‌త అటెన్ష‌న్ డ్రా చేస్తుంది. ఇది త‌రుచూ జ‌రిగే చ‌ర్య‌. మ‌రి డైలీ ఈ ప‌ని చేసి చేసి బోర్ కొట్టిందో! ఏమో ఈసారి డిఫ‌రెంట్ గా ఓ వీడియో చేసింది.

అన‌న్య పాండే మేక‌ప్ వేసుకుంటుండగా....కొరియో గ్రాఫ‌ర్ ఫరాఖాన్ అన‌న్యా అన‌న్యా అంటూ దూసుకొస్తూ నువ్వు ఖ‌లీ పిలీ సినిమాకి గాను జాతీవ అవార్డు గెలుచుకున్నావ్ అంటూ బిగ్గ‌ర్ గా చెబుతుంది. దీనికి అన‌న్య ఆనందంతో ఉబ్బి త‌బ్బిబ్బితుంది.

చుట్టూ ఉన్న మేక‌ప్ గ్యాంగ్ సైతం సంతోషం వ్య‌క్తం చేస్తారు. ఇంత‌లో కూల్ గా చేతులు క‌ట్టుకుని నేను జోక్ చేస్తున్నాని అని అంటుంది ఫ‌రాఖాన్. దీంతో అన‌న్య అప్స‌ట్ మూడ్ లోకి వెళ్లిపోతుంది. ఈ వీడియో గురించి అన‌న్య మాట్లాడుతూ.. ఈవీడియోకి 50 రూపాయ‌లు ఇస్తాను. కేవ‌లం ఓవ‌ర్ యాక్టింగ్ కే. ఫ‌రాఖాన్ తో ఎప్పుడూ హాస్యాస‌ప‌దంగానే ఉంటుంది అని తెలిపింది.

ఈ వీడియో చూసిన చుంకీ పాండే ఏమన్నారంటే?.. ఫ‌రా ఈ వీడియోలో అతిగా న‌టించినందుకు నీకు అవార్డు రావాలి అన్నారు. దీనికి బ‌ధులుగా ఫ‌రా ఇలా అంటుంది.. 'అప్నీ బేటికో సంభాల్ పెహ్లే' అని అంటుంది. ప్ర‌స్తుతం ఈ వీడియోపై ట్రోల‌ర్లు ఆడుకుంటున్నారు. త‌మ‌దైన శైలిలో మీమ్స్ చేస్తూ ఆట‌ప‌ట్టిస్తున్నారు.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే కుమార్తెను ఇలా ఆట ప‌ట్టించ‌డం చుంకీ పాండేకి నిజంగా న‌చ్చ‌లేదా? అందుకేనా! అంత వేగంగా 'అవార్డు నీకే రావాలి అంటూ' ప‌రాఖాన్ పై కౌంట‌ర్ వేసారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కుమార్తెల‌పై చిన్న జోకులేసినా త‌ట్టుకోలేని త‌ల్లిదండ్రులుంటారు. అస‌లే చుంకీ గారాల ప‌ట్టి. కెరీర్ ఇప్పుడే మొద‌లు పెట్టంది. అన‌న్య‌పై జోకులేయ‌డం ఫ‌రాకి కొత్తేం కాదు. ఇది అల‌వాటుగా మారిపోతే ప్ర‌మాద‌క‌ర‌మే. అందుకే చుంకీ కౌంట‌ర్ వేసారని అంటున్నారు.