Begin typing your search above and press return to search.

'సైరా' కు ఆస్కార్ మూవీ పోటీ!

By:  Tupaki Desk   |   30 Sep 2019 3:27 PM GMT
సైరా కు ఆస్కార్ మూవీ పోటీ!
X
పాన్ ఇండియా చిత్రం `సైరా-న‌ర‌సింహారెడ్డి`కి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ `వార్` రూపంలో ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఎదుర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వార్ అటు ఉత్త‌రాదిన‌.. ఇటు ద‌క్షిణాదిన భారీగా రిలీజ‌వుతోంది. హృతిక్ రోష‌న్- టైగ‌ర్ ష్రాఫ్ లాంటి ట్యాలెంటెడ్ స్టార్లు న‌టించిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. అయితే ఈ సినిమా ఒక్క‌టేనా సైరాకు పోటీ అంటే.. ఆస్కార్ రేంజు హాలీవుడ్ క్రేజీ మూవీ `జోక‌ర్` మెట్రో న‌గ‌రాల్లో పోటీప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. ఆ సినిమా అక్టోబ‌ర్ 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. అంటే సైరా రిలీజైన రెండ్రోజుల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. దాదాపు 390 కోట్ల (5.5 కోట్ల అమెరికా డాల‌ర్లు) బ‌డ్జెట్ తో జోక‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ట్రైల‌ర్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. 2020 ఆస్కార్ బ‌రిలో అవార్డు ఖాయ‌మని ఫిలింక్రిటిక్స్ అంచ‌నా వేస్తున్నారు.

జోక‌ర్ మూవీ గురించి ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ వెలువ‌రించిన క‌థ‌నం ప్ర‌కారం.. చాలా ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి. అస‌లు జోక‌ర్ అనే పాత్రకు చాలా పెద్ద హిస్ట‌రీ ఉంది. క్లాసిక్ డేస్ కామిక్ బుక్ నుంచి.. బ్యాట్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ నుంచి పుట్టుకొచ్చిన గొప్ప‌ పాత్ర ఇది. దీనిపై ఇప్ప‌టికే ప‌లు ఫీచ‌ర్ ఫిలిమ్స్ ని ప్ర‌ఖ్యాత‌ డీసీ సంస్థ నిర్మించింది. హిత్ లెజ‌ర్ అనే హాలీవుడ్ న‌టుడు బ్యాట్ మ్యాన్ (డార్క్ నైట్) సిరీస్ లో జోక‌ర్ పాత్ర‌లో న‌టించాడు. అయితే అత‌డు చ‌నిపోయిన త‌ర్వాత చాలామంది ఈ పాత్ర‌లో మెప్పించేందుకు ప్ర‌త్నించినా స‌ఫ‌లం కాలేదు. తాజాగా డీసీ సంస్థ తెర‌కెక్కించిన లేటెస్ట్ జోక‌ర్ చిత్రంలో జాన్విన్ ఫోనిక్స్ న‌ట‌న‌కు గొప్ప గుర్తింపు ద‌క్కుతోంది.

అస‌లు జోక‌ర్ క‌థాంశం ఏమిటి అంటే.. ఒక పేద‌వాడైన యువ‌కుడు ఫ్లెక్ (జాక్విన్ ఫోనిక్స్) త‌న త‌ల్లితో క‌లిసి మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తుంటాడు. అత‌డు ఒక క‌ళాకారుడిగా (జోక‌ర్ గా) జీవ‌నోపాధి పొందుతుంటాడు. న‌గ‌రంలోనే టాప్ కమెడియ‌న్ గా ఐడ‌ల్ గా ముర్రే ఫ్రాంక్లిన్ (రోబ‌ర్ట్ డీ నిరో) రేంజుకు ఫ్లెక్ ఎద‌గాల‌నుకుంటాడు. అయితే ఫ్లెక్ క‌ల ఎప్ప‌టికీ నెర‌వేర‌దు. బ్యాడ్ ల‌క్ వెంటాడ‌డంతో అత‌డు గొప్ప న‌టుడు కాలేక‌ చివ‌రికి జోక‌ర్ గా మారాల్సి వ‌స్తుంది. అత‌డి జీవితం ఎంత ఉద్విగ్నంగా సాగింది? అన్న‌ది ఆద్యంతం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఈ చిత్రానికి ఫిలిప్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బ్యాట్ మ్యాన్ సిరీస్ విల‌న్ కి కొన‌సాగింపు పాత్ర‌తో రూపొందించిన సినిమా కాబట్టి ఆ సిరీస్ అభిమానులు థియేట‌ర్ల‌కు పోటెత్తడం ఖాయం అని అంచ‌నా వేస్తున్నారు. 1970-80ల త‌ర‌హాలో క్లాసిక్ క్యారెక్ట‌ర్ లో ఫోనిక్స్ న‌ట‌న ర‌క్తి క‌ట్టిస్తోంది. కామిక్ బుక్ మైథాల‌జీ నుంచి స‌ప‌రేట్ చేయ‌బ‌డిన ఒక పాత్ర నుంచి పుట్టిన మూవీ గా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వండ‌ర్ ఉమెన్ - ఆక్వామేన్ - షాజ‌మ్ వంటి భారీ చిత్రాల్ని అందించిన డీసీ కామిక్స్ యూనివ‌ర్శ్ సంస్థ ఈ చిత్రాన్ని అందిస్తోంది.