Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ పై జోకులే జోకులు

By:  Tupaki Desk   |   20 July 2017 3:17 AM GMT
బిగ్ బాస్ పై జోకులే జోకులు
X
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా బుల్లితెరపై మెరుస్తున్న కార్యక్రమం బిగ్ బాస్. ఇంటర్నేషనల్ గా సూపర్ హిట్ అయిన ఈ కాన్సెప్ట్ ను ఇప్పుడు తెలుగులోకి తీసుకొచ్చారు. స్థానిక వెర్షన్ స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతుండగా.. జూలై 16 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికి కేవలం మూడు ఎపిసోడ్స్ మాత్రమే జనాలు చూశారు.

అందులో ఒకటి హోస్ట్.. పార్టిసిపెంట్స్ ఇంట్రడక్షన్ కే సరిపోయింది. అయినా సరే.. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ పై విపరీతమైన కామెడీ జరిగిపోతోంది. ముఖ్యంగా పార్టిసిపెంట్స్ ఓవర్ యాక్షన్ కు నెటిజన్లు విపరీతంగా రియాక్ట్ అవుతున్నారు. ఒకరికి మించి మరొకరు యాక్టింగ్ ఇరగదీసేస్తుండడం.. జనాల్లో అసహనం పెంచేస్తోంది. చూసే కొద్దీ క్యూరియాసిటీ పెంచాల్సిన ఈ షో.. ఆ యాంగిల్ లో కాకపోయినా.. వెటకారం జోకుల విషయంలో మాత్రం కొత్త ట్రెండ్ అయిపోతోంది.

సినిమాల్లో వచ్చే జోకులు అన్నీ సోషల్ మీడియా లో బిగ్ బాస్ పై పేలుతున్నాయి. దూకుడు సినిమాలో బ్రహ్మీ పేల్చే ఓ కామెడీ డైలాగ్ కి పేరడీ అయితే.. ఇక్కడ బాగా పేలింది. 'నాగార్జున గారూ.. ఎలిమినేట్ హిం ఇమ్మీడియెట్లీ' అంటూ బ్రహ్మానందం వేసిన డైలాగ్ ను.. ఈ పార్టిసిపెంట్స్ కు అన్వయించి.. అందరినీ ఒకేసారి ఎలిమినేట్ చేసేయమంటున్నారు. మొదట్లోనే ఇంత కామెడీ అయిపోతే.. 70 రోజుల పాటు ఏం జరగనుందో చూడాలి.