Begin typing your search above and press return to search.
'జాలీ ఓ జింఖానా'.. సిగ్నేచర్ స్టెప్పులతో ఆకట్టుకున్న విజయ్..!
By: Tupaki Desk | 6 April 2022 1:40 PM GMTతమిళ స్టార్ హీరో విజయ్ - బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ''బీస్ట్''. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని.. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
ఇటీవల విడుదల చేసిన 'బీస్ట్' తెలుగు ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. అలానే తమిళ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అరబిక్ కుత్తు - హలమితి హబీబో' పాట కూడా ఇక్కడ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా 'జాలీ ఓ జింఖానా' తెలుగు వెర్షన్ సాంగ్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'ఎప్పుడు ఆగిపోకురా విశ్వదాభిరామా.. తప్పక లైఫ్ మారురా వినారా వేమా.. పైకి ఎన్నో వస్తుంటాయ్.. పక్కకెళ్లి పోతుంటాయ్.. సరదాగా నవ్వు నవ్వేయ్ రా..' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ట్యూన్ కు గీత రచయిత చంద్రబోస్ లిరిక్స్ రాసారు.
డబ్బింగ్ పాట అయినప్పటికీ ట్యూన్ కు తగ్గట్టుగా తెలుగు సాహిత్యం అందిస్తూ.. ఎలాంటి బాధలు వచ్చినా నవ్వుతూ జీవితాన్ని గడపాలనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబోస్. 'జాలీ ఓ జింఖానా' పాటను తమిళ్ లో హీరో విజయ్ స్వయంగా ఆలపించగా.. ఇప్పుడు తెలుగు వెర్సన్ ను నకాజ్ అజిజ్ పాడారు.
'జాలీ ఓ జింఖానా' పాటలో విజయ్ - పూజా కలర్ ఫుల్ డ్రెస్సుల్లో పోటాపోటీగా వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. జానీ మాస్టర్ తనదైన శైలిలో సిగ్నేచర్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ లిరికల్ వీడియోలో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మరియు అనిరుధ్ కనిపించి సందడి చేశారు.
మనోజ్ పరమహంస దీనికి సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్. నిర్మల్ ఎడిటింగ్ వర్క్ చేసారు. తమిళ్ లో జాలీ ఓ జింఖానా పాట ఇప్పటికే 40 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మరి 'బీస్ట్' తెలుగు వెర్సన్ సాంగ్ కు ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.