Begin typing your search above and press return to search.
శృతి ఇంటర్వ్యూపై దుమారం
By: Tupaki Desk | 18 April 2016 3:47 AM GMTహీరోయిన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిపై ఏదో వివాదం తలెత్తడం ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది. ముఖ్యంగా జర్నలిస్టులు నోటికొచ్చిన ప్రశ్న అడగడం, ఆ ప్రశ్నకు వీరు కోరుకున్నదో లేక అలవు ఆన్సర్ ఇవ్వకపోవడమో జరిగితే మాత్రం.. ఇక ఆ రైటర్ పెన్నుకు హద్దు ఉండడం లేదు.
రీసెంట్ గా శృతి హాసన్ ఇంటర్వ్యూ గురించి ఇలాంటి ఒక వివాదమే నడుస్తోంది. 'మేం మాట్లాడుతున్నంత సేపు శృతిహాసన్ ఇబ్బందిగానే ఉంది. అఫ్ కోర్స్.. ఎందుకలా అనే విషయం నేను ప్రశ్నించలేదు' అని రాశాడా సీనియర్ జర్నలిస్ట్. అసలీ ఇంటర్వ్యూ ఇవ్వడమే ఇష్టం లేదన్నట్లుగా శృతి ప్రవర్తన ఉందన్నది అతని ఆరోపణ. అయితే శృతి హాసన్ ని ఇప్పటి వరకూ కలిసిన మీడియా జనాలు మాత్రం ఈ ఇంటర్వ్యూని ఖండిస్తున్నారు.
'ప్రశ్నలు అడిగేవాళ్ల మైండ్ లో అప్పటికే ఆన్సర్స్ ఉంటే మనం చేయగలిగింది మాత్రం ఏమంటుంది.. కొన్ని అంతే' అంటూ శృతి హాసన్ చేసిన ట్వీట్.. ఈ ఇంటర్వ్యూలో అసంబద్ధమైనవి, ఆమె చెప్పనివి ఎన్నో ఉన్నాయనే విషయాన్ని బైటపెట్టేసింది. శృతి హాసన్ పై ఏదో ఒక ఆరోపణలు చేసేందుకే ఈ ఇంటర్వ్యూ ప్రచురించారనే కామెంట్స్ మీడియా జనాల్లోనే వినిపిస్తుండడం విశేషం.