Begin typing your search above and press return to search.
తెలుగు డైరెక్టర్ పై కేసు పెట్టిన జర్నలిస్ట్
By: Tupaki Desk | 22 Jun 2016 1:35 PM GMTదర్శకుడు వీఎన్ ఆదిత్యపై ఓ లీడింగ్ ఇంగ్లీష్ డైలీలో ఆర్టికల్ ఒకటి వచ్చింది. కుటుంబాన్ని గాలికి వదిలేసిన దర్శకుడు వీఎన్ ఆదిత్య.. అంటూ ఆ ఆర్టికల్ లో ఉంటుంది. ఓ సింగర్ తో రిలేషన్ ఉందని.. అమెరికా వెళ్లిపోయి పెళ్లాం పిల్లలను పట్టించుకోవడం లేదని దాని సారాంశం. దీన్ని చూసిన వీఎన్ ఆదిత్యకు ఒళ్లు మండిపోయి.. తన సోషల్ నెట్వర్కింగ్ పేజ్ లో నానా తిట్లు తిట్టేశాడు. వాస్తవం ఏంటో తెలీకుండా రాస్తే జర్నలిస్టులు అవుతారా అంటూ నిలదీశాడు. ఈడియట్, ఫ.. లాంటి పదాలను కూడా రాశాడు వీఎన్ ఆదిత్య.
ఇప్పుడీ వ్యవహారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ విషయాన్ని కూడా ఆ దర్శకుడే తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా వెల్లడించాడు. 'సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లెయింట్ సదరు జర్నలిస్ట్. ఇపుడే నాకు మెసేజ్ చేసిన ఇన్ స్పెక్టర్.. (..)నెంబర్ నుంచి నాకు మెసేజ్. నేను ఫోన్ చేసి మాట్లాడాను. అతను నిజంగా క్రైమ్ బ్రాండ్ ఇన్ స్పెక్టర్ అయితే.. చట్టాన్ని గౌరవించి, నన్ను నేరుగా సంప్రదించగలగినందుకు అతనికి థాంక్యూ. సో కాల్డ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ నన్ను రీచ్ అవకపోయాడు. హ్యాట్సాఫ్ టు సైబర్ క్రైమ్ హైద్రాబాద్' అంటూ పోస్ట్ చేశాడు వీఎన్ ఆదిత్య.
సామాజిక నేరాలు అంగీకరిస్తారు కానీ.. సైబర్ క్రైమ్ మాత్రం తప్పంటున్నారు అంటూ తన కామెంట్స్ లో ఒకరికి వీఎన్ ఆదిత్య ఆన్సర్ ఇవ్వడం ఆలోచించాల్సిన విషయం.