Begin typing your search above and press return to search.
జర్నలిస్ట్ లకు హరిత హారం ఛాలెంజ్ చేసిన సీనియర్ జర్నలిస్ట్
By: Tupaki Desk | 31 July 2018 6:52 AM GMTసినిమా తారలైనా - రాజకీయ నాయకులైనా వాళ్ళు చేసే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల మరియు పిఆర్ఓల పాత్ర ఎంతనో తెరపైకి కనిపించకపోయినా ఆ రంగంతో పరిచయమున్న ప్రతిఒక్కరికి అందులో కష్టం తెలుసు. ఇటీవలి కాలంలో హరిత హారం ఛాలెంజ్ పేరిట జరుగుతున్న మొక్కలు నాటే కార్యక్రమంలో సెలెబ్రిటీలు మొదలుకుని సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సోషల్ మీడియాలో ఛాలెంజ్ పేరుతో అదే పనిని మరొకరు చేసే విధంగా స్ఫూర్తినివ్వడం మహేష్ బాబు - చిరంజీవి లాంటి వాళ్లను సైతం కదిలించి ముందుకు తీసుకువచ్చింది. ఇప్పుడు మొదటిసారి జర్నలిస్ట్ లు కూడా ఇందులో భాగం అవుతున్నారు. దానికి నాంది పలుకుతూ వందలాది సినిమాలకు పిఆర్ ఓ గా చేసిన వేణుగోపాల్ ముందుకు వచ్చారు. స్వయంగా తాను నాటిన హై బిస్కస్ మొక్కను చూపుతూ తన జర్నలిస్ట్ మిత్రులను ఛాలెంజ్ చేయటం ఇప్పుడు అందరికి స్ఫూర్తిగా నిలవడమే కాదు కొత్త ట్రెండ్ కి దారి తీస్తోంది.
ఎప్పుడూ సెలెబ్రిటీలనే కాకుండా ఇలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే జర్నలిస్ట్ లను ఇందులో భాగం చేయటం పట్ల వేణుగోపాల్ పై ప్రత్యేక ప్రశంశలు వస్తున్నాయి. ఇలా చేయటం ద్వారా హరిత హారం లాంటి మంచి కార్యక్రమానికి ఇంకా బాగా ప్రాచుర్యం లభించే అవకాశం దక్కుతుందని అందుకే దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని తన మీడియా మిత్రులకు ఛాలెంజ్ చేయటం ద్వారా ఒక సంతృప్తిని పొందుతున్నానని వేణుగోపాల్ పేర్కొన్నారు. తనలాగే మిత్రులందరూ ముందుకు వస్తే కాలుష్యంతో సతమవుతున్న మన పట్టణాలు - నగరాలను కాపాడుకునే విధంగా ముందుకు వెళ్లొచ్చని - ఇది భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శిలా ఉపయోగపడుతుందని చెబుతూ ఛాలెంజ్ చేసిన వెంటనే స్పందించిన మిత్రులకు వేణుగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.