Begin typing your search above and press return to search.

జ‌ర్న‌లిస్టుల‌కు మిల్కీ టార్చ‌ర్

By:  Tupaki Desk   |   3 Dec 2018 5:02 AM GMT
జ‌ర్న‌లిస్టుల‌కు మిల్కీ టార్చ‌ర్
X
మిల్కీవైట్ బ్యూటీ త‌మ‌న్నాలో ఊహించ‌ని మార్పు ఫిలిం వ‌ర్గాల్లో - సినీ జ‌ర్న‌లిస్టుల్లో చ‌ర్చ‌కొచ్చింది. ఈ భామ మునుప‌టితో పోలిస్తే ఇప్పుడు చాలా బోల్డ్‌ గా క‌నిపిస్తోంది. పైగా యాటిట్యూడ్‌ లోనూ బోల్డ్ నెస్ తెలిసిపోతోంది. కాస్త వెయిటింగ్ చేయిస్తే త‌ప్పేంటి? అన్న ధోర‌ణితో మిల్కీ ప‌లువురికి చుక్క‌లు చూపించ‌డంపైనా చిరాకులు - ప‌రాకులు క‌నిపిస్తున్నాయి.

త‌మ‌న్నా నటించిన `నెక్ట్స్ ఏంటి?` ఈనెల 7న రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మీడియా ఇంట‌రాక్ష‌న్ కోసం జ‌ర్న‌లిస్టుల్ని హైద‌రాబాద్‌- ద‌స‌ప‌ల్లాకి ఆహ్వానించారు. కానీ అక్క‌డే అస‌లు క‌థంతా మొద‌లైంది. మిల్కీ కోసం గంట కాదు.. 2 గంట‌లు కాదు.. ఏకంగా 3 గంట‌ల పాటు సుదీర్ఘంగా వెయిట్ చేశారంతా. అరే.. నా కోసం ఆ మాత్రం వెయిట్ చేయ‌లేరా? అన్న‌ట్టే ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం క‌నిపించ‌డంతో అంద‌రిలో చిట‌ప‌టలు మొద‌ల‌య్యాయి. మొత్తానికి వెయిట్ చేయించి చుక్క‌లు చూపించింది త‌మ్మూ. జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో నెక్ట్స్ ఏంటి? అన్న‌ది అటుంచితే.. ఇంట‌ర్వ్యూ పేరుతో 150 మంది సినీజ‌ర్న‌లిస్టులు ద‌స‌ప‌ల్లాలో అదే ప‌నిగా గంట‌ల కొద్దీ ప‌డిగాపులు ప‌డ్డారు.

ఎదురు చూస్తుంటే.. ఇంత‌కీ రాదు.. ఎంత‌కీ రాదు.. అయ్యో పాపం! ఒక‌వేళ చెన్న‌య్ నుంచి విమానంలో వ‌స్తుందేమో అందుకే ఆల‌స్య‌మైందంటూ ఓపిగ్గా వేచి చూసిన జ‌ర్న‌లిస్టులకు చివ‌రిలో ఓ ట్విస్టు. ఈ అమ్మ‌డు స్టే చేసిన బ‌స హైద‌రాబాద్‌- పార్క్‌ హ‌య‌త్‌ లో ఉంది. అక్క‌డ ఆల్రెడీ అరైవ్ డ్‌. విశ్రాంతి తీసుకుంటోంద‌ట‌. అది తెలిసాక మాత్రం లోక‌ల్ గా ఉండి ఇంత‌గా చుక్క‌లు చూపిస్తుంద‌నుకోలేదు అంటూ మా మంచి జ‌ర్న‌లిస్టులు లోలోన తెగ మ‌ద‌న‌ప‌డిపోయారు. పార్క్ హ‌య‌త్ హోట‌ల్ నుంచి ద‌స‌ప‌ల్లా హోట‌ల్ మ‌ధ్య కేవ‌లం కిలోమీట‌ర్ మాత్ర‌మే దూరం. ఆ దూరం చేర‌డానికి అంత క‌ల‌రింగ్ ఇచ్చింది మిల్కీ. వేచి చూస్తున్న జ‌ర్న‌లిస్టుల్ని స‌ముదాయించ‌లేక పీఆర్‌ లు ఫోన్ కాల్‌ ప్ర‌య‌త్నించినా.. ఫోన్ కూడా ఎత్త‌లేద‌ట‌ ఈ భామ‌. దీంతో ఇటీవ‌ల మిల్కీ తీరు తెన్నులపై గ‌రంగంగా ఉన్నారంతా.ప్ర‌మోష‌న్స్ విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తోందంటూ లీకులు అందాయి. మొత్తానికి మిల్కీ నటించే నెక్ట్స్ ఏంటి? అన్న‌దానిపై క్లారిటీ లేక‌పోయినా ప్ర‌స్తుతంలో మాత్రం అలా ఆడుకుంటోందన్న‌ది క్లోజ్ సోర్స్ చెబుతున్న మాట‌.