Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. అన్నను పైకి తెస్తాడా?
By: Tupaki Desk | 19 Oct 2015 8:05 AM GMT‘అతనొక్కడే’ లాంటి సూపర్ హిట్ తో నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్నందుకున్నాడు కళ్యాణ్ రామ్. కానీ ఆ తర్వాత ఆ బేనర్లో తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే. ముఖ్యంగా ఓం లాంటి పాతిక కోట్ల సినిమాను నెత్తికెత్తుకుని కళ్యాణ్ రామ్ తిన్న దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఐతే ఎట్టకేలకు ఈ ఏడాది ‘పటాస్’ సినిమాతో కాస్త లేచి నిలబడే ప్రయత్నం చేశాడు కళ్యాణ్ రామ్. కానీ ఆ సినిమాతో వచ్చిందంతా ‘కిక్-2’ ఊడ్చేసింది. కొత్త అప్పులు కూడా తెచ్చిపెట్టింది. ఐతే ఈసారి నిలబెట్టే బాధ్యతను తనే తీసుకోబోతున్నాడు తమ్ముడు ఎన్టీఆర్.
తాత పేరు మీద పెట్టిన ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్’ బేనర్లో వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వక్కంతంతో ఎన్టీఆర్ కు చాలా మంచి అనుబంధం ఉంది. అశోక్ - ఊసరవెల్లి - టెంపర్ సినిమాలకు కథకుడు వంశీనే. ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయడం కోసం అతను చాలా కాలం నుంచే ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. ఆప్త మిత్రుడి దర్శకత్వంలో అన్నయ్య కోసం సినిమా చేస్తున్నాడు కాబట్టి ఎన్టీఆర్ ఈ సినిమా విసయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బడ్జెట్ కూడా హద్దుల్లో ఉండేలా చూసుకుని.. తక్కువ పని దినాల్లో సినిమా పూర్తి చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నారట. వచ్చే వేసవిలో సినిమా మొదలు కాబోతోంది. ఆలోపు స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసే పనిలో ఉన్నాడు వక్కంతం. మరి అన్నను నిలబెట్టడానికి తమ్ముడు చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.