Begin typing your search above and press return to search.
కన్నీరు మున్నీరు అయిన కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్
By: Tupaki Desk | 29 Aug 2018 1:47 PM GMTయాక్సిడెంట్ లో మృతి చెందిన హరికృష్ణ నందమూరి కుటుంబంలో విషాదం నింపిన విషయం తెల్సిందే. తండ్రి యాక్సిడెంట్ వార్త వినగానే కొడుకులు కళ్యాణ్ రామ్ - హరికృష్ణలు హుటా హుటిన నార్కట్ పల్లి కామినేనికి చేరుకున్నారు. విషయం తెలిసినప్పటి నుండి వారిద్దరు దుఖ: సాగరంలో మునిగి పోయారు. అయినా కూడా నిబ్బరంగా కనిపిస్తే జరగాల్సిన కార్యక్రమాలు చూశారు. కన్న కొడుకులుగా వారి భాద్యతను నిర్వర్తించారు. హాస్పిటల్ నుండి హైదరాబాద్ కు ఆంబులెన్స్ లో హరికృష్ణ మృతదేహంను తరలించడం జరిగింది. కళ్యాణ్ రామ్ మరియు ఎన్టీఆర్ నార్కట్ పల్లి నుండి హైదరాబాద్ లోని ఇంటి వరకు ఆంబులెన్స్ లోనే తండ్రి మృతదేహంతో ప్రయాణించారు.
ఇక తండ్రి మృతదేహం ఆంబులెన్స్ ఇంటికి చేరుకున్న తర్వాత ఇద్దరు ముందుండి ఆంబులెన్స్ ను లోనికి తీసుకు వెళ్లారు. ఆ తర్వాత అంబులెన్స్ నుండి మృతదేహంను స్వయంగా వీరిద్దరు కిందకు దించి లోనికి తీసుకు వెళ్లడం జరిగింది. వీరికి తోడు హరికృష్ణకు అత్యంత ఆప్తుడిగా పేరున్న కొడాలి నాని కూడా మృతదేహంను ఇంట్లోకి చేర్చడంలో ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు సాయంగా నిలిచాడు. ఎంతో మంది ఉన్నా కూడా వీరిద్దరు తమను కన్నందుకు ఈ విధంగా అయినా తండ్రి రుణం తీర్చుకోవాలని స్వయంగా మోసుకు వెళ్లడం హర్షనీయం.
హరికృష్ణకు రేపు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. హరికృష్ణ మృతదేహంకు నివాళ్లు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ కు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి ధైర్యం చెబుతున్నారు.