Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ సినిమాను త్రివిక్రమ్ పక్కన పెట్టబోతున్నాడా..?
By: Tupaki Desk | 3 April 2020 7:30 AM GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రదర్శకుడిగా వెలుగొందుతున్నాడు. తన మాటలతోనే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభ చూపించిన దర్శకుడు ఆయన. 'అతడు', అత్తారింటికి దారేది, జల్సా, అ ఆ, అరవింద్ సమేత వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. త్రివిక్రమ్ సంక్రాంతి సీజన్లో రిలీజైన 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అదే ఊపుతో జూనియర్ ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెట్టే పనిలో ఉన్నారట చిత్ర బృందం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
కరోనా ఎఫెక్ట్ వల్ల షూటింగ్ వాయిదా పడటంతో ఇప్పుడల్లా ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యే అవకాశం కనిపించడంలేదు. దీంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సమ్మర్ కి వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమా పూర్తయ్యే దాకా త్రివిక్రమ్ ఖాళీగా ఉండాలని భావించడం లేదంట. అందుకే ఈ గ్యాప్ లో ఒక సినిమా తీయాలని ఆలోచిస్తున్నాడట. ఇటీవల మలయాళ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' చిత్రాన్ని చూసిన త్రివిక్రమ్ తెలుగు రీమేక్ కి డైరెక్షన్ చేయాలనీ అనుకున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు. త్రివిక్రమ్ కి టైం గ్యాప్ దొరికితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.