Begin typing your search above and press return to search.

గారు ఏంట్రా బ‌లిసిందా?

By:  Tupaki Desk   |   20 Jan 2019 3:20 AM GMT
గారు ఏంట్రా బ‌లిసిందా?
X
అక్కినేని కుటుంబంతో తార‌క్ అనుబంధం ఎలాంటిదో `మిస్ట‌ర్ మ‌జ్ను` ట్రైల‌ర్ వేడుక రివీల్ చేసింది. కింగ్ నాగార్జున‌ను బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచారు యంగ్ టైగ‌ర్. చైత‌న్య‌, అఖిల్ ఇద్ద‌రినీ సోద‌ర స‌మానులుగా భావిస్తాడు. సొంత కుటుంబం అన్న భావ‌న త‌న‌కు ఉంద‌ని వేదిక‌పైనే తారక్ అన్నారు. మ‌జ్ను వేదిక‌పై తార‌క్ స్పీచ్ ఆద్యంతం ఎంతో ఎమోష‌న‌ల్ గా సాగింది. అక్కినేనీస్ తో త‌న బాండింగ్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని సంగ‌తుల్ని చెప్పారు తార‌క్.

ఇదే వేదిక‌పై తార‌క్ తో త‌న అనుబంధాన్ని అఖిల్ గుర్తు చేసుకున్నాడు. ``ఎన్టీఆర్‌ని నేను టైగర్ అని పిలుస్తాను. నిజంగా ఆయన టైగర్‌. ఎందుకంటే ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్‌ చేయలేరు. తారక్‌గారు అంటే ఆయన తట్టుకోలేరు. అలా అంటే ఎంట్రా బలిసిందా? అని అంటారు`` అని అఖిల్ అన్నారు. తారక్ ఇక్కడ వచ్చినందుకు థాంక్స్‌. తను ఈ ఫంక్షన్ కి వస్తున్నానని చెప్పగానే తనకు థాంక్స్‌ మెసేజ్‌ పంపాను. ``అరే అలా ఫార్మల్ గా ఉండకు. ఇది నా బాధ్యత`` అని తను అన్నాడు. అక్కినేని ఫ్యాన్స్, ఎన్టీఆర్‌ అభిమానులకు థాంక్స్‌. మీరే మా ధైర్యం.. మా అండ`` అంటూ అఖిల్ వేదిక‌పై ఎమోష‌న‌ల్ అవ్వ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది.

అఖిల్‌ అక్కినేని మాట్లాడుతూ - ``సినిమా సక్సెస‌వ్వాలంటే మంచి నిర్మాత కావాలి. ఈ సినిమాకు గాడ్ ఫాదర్‌ బివిఎస్ ఎన్‌.ప్రసాద్ గారు. మా తాతగారితో సినిమా చేసిన ఆయన నన్ను నమ్మి సినిమా చేసినందుకు ఆనందంగా, గర్వంగా ఉంది. మా డైరెక్టర్‌ వెంకీకి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్ తో పాటు అందరికీ థాంక్స్‌. తమన్ 6 అద్భుత‌మైన పాట‌ల్ని అందించాడు. ఈ ఆల్బమ్‌ నాకు ఎంతో స్పెషల్‌. శేఖర్‌ మాస్టర్‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక డైరెక్టర్‌ వెంకీ నాకు మంచి ఫ్రెండ్‌. మూడేళ్ల క్రితం నాకు తను ఈ స్క్రిప్ట్‌ చెప్పాడు. మూడో సినిమాకు ఈ స్క్రిప్ట్‌ కరెక్ట్‌, వెయిట్‌ చేస్తావా? అన్నాను. తను సరేనని వెయిట్‌ చేసి ఇప్పుడు సినిమా తీశాడు. తను నాకు పెద్ద ఫ్యాన్‌. నా కోసం వెయిట్‌ చేసినందుకు తనకు థాంక్స్‌. నా మెంటర్‌, గైడ్‌ నాన్నగారే. ఆయన నాకు స్నేహితుడు.. పెద్దన్నయ్యతో సమానం. ఆయన ఇచ్చే సపోర్ట్‌.. గైడెన్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేనేలేదు`` అని అన్నారు. ప్రతి సినిమాకు కష్టాలుంటాయి. కష్టాలు ముఖ్యం కాదు. వాటిని ఎలా దాటుతామనేదే ముఖ్యమ‌ని అఖిల్ అన్నారు.