Begin typing your search above and press return to search.

నాకు తెలిసిన జ‌క్కన్న ప్ర‌ప‌చ‌మంతా తెలియాలి: ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   3 Dec 2022 5:30 PM GMT
నాకు తెలిసిన జ‌క్కన్న ప్ర‌ప‌చ‌మంతా తెలియాలి: ఎన్టీఆర్
X
ఇండియ‌న్ స్పీల్ బ‌ర్గ్ రాజ‌మౌళి వండ‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా? ప్ర‌పంచ దేశాలే అత‌ని చిత్రాల‌కు దాసోహం అవుతున్నాయి. `బాహుబ‌లి`.. `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలు ప్ర‌పంచ వ్యాప్తంగా అత‌నికి ప్ర‌త్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఆర్ ఆర్ ఆర్ తో అస్కార్ రేసులోనూ నుంచున్నారు? అంటే రాజ‌మౌళి ఖ్యాతి గురించి చెప్పేదేముంది? ఇండియాలో ఏ ద‌ర్శ‌కుడికి ఇది సాధ్యం.

భార‌త్ త‌రుపున నామినేట్ చేయ‌క‌పోయినా..జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీ విభాగంలో ఆస్కార్ ఎగ‌రేసుకురావాల‌ని అమెరికాలో మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఈ క్ర‌మంలో హాలీవుడ్ దిగ్గ‌జాలతోనే స‌మావేశ‌మ‌వుతున్నారు. వ్య‌క్తిగ‌తంగా కోట్ల రూపాయలు ఖ‌ర్చు చేస్తున్నారు. ఇలా ఒక‌టేంటి భ‌విష్య‌త్ లో రాజ‌మౌళి మ‌రిన్ని అద్భుతాలు చేస్తారు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ద‌ర్శ‌కుడిగా తాను ఎద‌గ‌డ‌మే కాదు..ఇండియానే గ‌ర్వ‌ప‌డేలా చేస్తాడు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్అవార్డుల్లో..బెస్ట్ డైరెక్ట‌ర్ గా రాజమౌళి అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో అన్ని భాష‌ల నుంచి జ‌క్క‌న్న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినంద‌న‌లు వెళ్తున్నాయి. బాలీవుడ్ దిగ్గ‌జాలు సైతం జ‌క్క‌న్న‌ని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

ఇక టాలీవుడ్ నుంచైతే చెప్పాల్సిన ప‌నిలేదు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. `ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌రింత కీర్తిని పొందే మీ ప్ర‌యాణంలో ఇది ఆరంభం మాత్ర‌మే. మీ గురించి నాకు ఏమి తెలుసో..అది ప్ర‌పంచ‌మంతా తెలుసు కోవాల్సిన స‌మ‌యం ఇది` అని పోస్ట్ చేసారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

రాజ‌మౌళి అభిమాన హీరో ఎన్టీఆర్ అన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో ఎంత మంది న‌టులున్నా? రాజ‌మౌళి అభిమానించే ఒకే ఒక్క హీరో అత‌ను. టైగ‌ర్ లో ఎదో స‌మ్ థింగ్ స్పెషల్ ఉంద‌ని..దానికి ఎప్పుడో క‌నెక్ట్ అయిపోయాను అని జ‌క్క‌న్న ప్ర‌తీసారి చెబుతుంటారు. ఈ విష‌యంలో ఎన్టీఆర్ చాలా ల‌క్కీ అనే చెప్పాలి. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు అభిమాన హీరో తార‌క్ అవ్వ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే క‌దా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.