Begin typing your search above and press return to search.
RRRలో జూ.ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ గ్రాఫిక్స్ చూశారా..?
By: Tupaki Desk | 11 Jun 2022 8:35 AM GMTRRR ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మేనియానే. సినిమా విడుదలై మూణ్నెళ్లైనా ప్రేక్షకులు ఇప్పటికీ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. థియేటర్‌లో రిలీజ్ అయినప్పటి నుంచి ఓటీటీలోకి వచ్చే వరకు చాలా మంది ఈ సినిమాను కనీసం 10 సార్లైనా చూసుంటారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పవర్ ప్యాక్ యాక్షన్ సీన్ల కోసం కొందరు చూస్తే.. చిన్నచిన్న డీటెయిల్స్ రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్‌ని కోసం మరికొందరు చూశారు.
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కామన్ ఫేవరెట్ సీన్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్. అడవిలో వేటకు వెళ్లిన ఎన్టీఆర్ పులిని వేటాడే ఈ సీన్‌లో ఎన్టీఆర్ ముఖంలో హావభావాలు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుణ్ని కట్టిపడేశాయి. ఈ సీన్‌లో రాజమౌళి క్రియేటివిటీ చూసిన వారంతా ఆయణ్ని జక్కన్న అని పిలవడంలో అతిశయోక్తి లేదని అంటున్నారు. ముఖ్యంగా ఈ సీన్‌లో ఎన్టీఆర్, పులి మధ్య వచ్చే విజువల్స్‌కు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది.
ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్‌లు ఇప్పటి వరకు వరల్డ్ సినిమాలో ఎక్కడా చూడలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఇంతటి అద్భుతమైన ఇంట్రడక్షన్ సీన్ న భూతో న భవిష్యత్ అంటూ కొనియాడుతున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీ లో ఇలాంటి ఘనమైన ఎంట్రీ సన్నివేశం మరే హీరోకు దక్కలేదని.. ఇక దక్కే అవకాశం కూడా లేదని అంటున్నారు. ఒకవేళ ఉంటే అది తీసింది రాజమౌళియే అయి ఉండాలని చెబుతున్నారు.
ఎన్టీఆర్ ఎంట్రీ సీనే ఫుల్ హైప్ అనుకుంటే దీనికి మించిన పవర్ ఫుల్ స్క్రీన్ ప్లేతో.. రిచ్ విజువల్స్‌తో ప్రీ ఇంటర్వెల్‌ను చూపించి ప్రేక్షకుల్ని తన సినిమాకు దాసోహం చేశాడు జక్కన్న. ఈ సినిమాలో భీం పాత్రలో ఎన్టీఆర్‌ని తప్ప మరెవర్నీ ఊహించుకోలేని విధంగా తన నుంచి రాజమౌళి నటనను రాబట్టాడు. సాధారణంగానే ఎన్టీఆర్ ఎమోషన్స్‌ని పండించడంలో దిట్ట.
యంగ్ టైగర్‌కు తోడు.. పవర్ ఫుల్ డైలాగ్‌లు.. అదిరిపోయే స్క్రీన్ ప్లే.. కాన్వాస్‌పై తను అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే వరకు కాంప్రమైజ్ కానీ జక్కన్న.. ఇవన్నీ కలిస్తే ఇక అడ్డేముంది. అందుకే RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన ప్రతిసారి ప్రేక్షుకులు తమ సీట్లో కుదురుగా కూర్చోలేక పోయారు. థియేటర్లన్నీ విజల్స్‌తో మార్మోగిపోయాయి.
RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్, ప్రీ ఇంటర్వెల్ విజువల్ వండర్ సీన్‌ను ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ రివీల్ చేశారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ లుక్స్ ఏ మాత్రం మారలేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ జంతువులు, చేతిలో నిప్పు వంటి సీన్లు మాత్రం చాలా రియలిస్టిక్‌గా కనిపించేలా గ్రాఫిక్స్ చేసినట్టు చూపించారు. ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి విజన్‌కి తగ్గ విజువల్ ఎఫెక్ట్ టీమ్ ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు.